కల్కి గ్రాండ్ సక్సెస్‌పై ప్రభాస్ మనసులో మాట
నాగ్ అశ్విన్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు.
By: Tupaki Desk | 10 July 2024 3:24 PM GMTకల్కి 2898 AD ఈ సంవత్సరంలో క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 600కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం త్వరలో ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. 800 కోట్ల క్లబ్ నుంచి 1000 కోట్ల క్లబ్ వైపు పయనిస్తోందని ఇంతకుముందే నిర్మాతలు వెల్లడించారు. నాగ్ అశ్విన్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. సినిమా విజయం గురించి కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌లను వెల్లడించాడు.
ఒక ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్‌ను ఈ చిత్రం భారీ విజయంపై ప్రభాస్ స్పందన ఏమిటి? అని అడిగారు. కొన్ని రోజుల క్రితం ప్రభాస్‌తో మాట్లాడానని బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించిన బాహుబలి, బాహుబలి 2, కల్కి 2898 AD అనే మూడు చిత్రాలలో తాను భాగమైనందుకు రెబల్ స్టార్ సూపర్ థ్రిల్లింగ్‌గా ఉన్నాని అన్నారు. సీక్వెల్‌లో ప్రభాస్‌ని పూర్తిగా కొత్త కోణంలో చూడడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారని నాగ్ అశ్విన్ తెలిపారు.
కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 11వ రోజు రూ.900 కోట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ చిత్రం సోమవారం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. విడుదలైనప్పటి నుండి, ఈ చిత్రం టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖుల నుండి సానుకూల సమీక్షలను పొందుతోంది. తాజాగా ఈ జాబితాలో మహేష్ బాబు కూడా చేరారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను సమీక్షించనందుకు ప్రభాస్ అభిమానులు మహేష్ పై విరుచుకుపడుతుండగా.. ఇప్పటికి అతడి నుంచి స్పందన వచ్చింది.
కల్కి టీమ్ పై మహేష్ ప్రశంసలు
విడుదలైన రెండు వారాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాపై మహేష్ బాబు స్పందిస్తూ ప్రతి ఫ్రేమ్ ఓ `కళాఖండం` అని అన్నారు. ఎక్స్ ఖాతాలో #Kalki2898AD... నా మనసు ఊపిరి పీల్చుకుంది.. జస్ట్ వావ్!! నాగ్ అశ్విన్.. మీ భవిష్యత్తు దృష్టికి హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం.. అని ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్ సాటిలేని టవర్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని కూడా ప్రశంసించాడు. దీపికా పదుకొణె, కమల్ హాసన్‌లపైనా తనదైన ప్రశంసను రాశాడు. సీనియర్ బచ్చన్ సార్ మీ మహోన్నత స్క్రీన్ ప్రెజెన్స్ సాటిలేనిది!! కమల్ హాసన్ సార్ మీరు నటించిన ప్రతి పాత్ర ప్రత్యేకంగా మీదే! ప్రభాస్.. మీరు మరో గొప్ప పనిని ఈజీగా నిర్వహించారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతం`` అని మహేష్ రాసారు.
గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 11
ఇతిహాసమైన హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం అద్భుత మైలురాయి వైపు దూసుకుపోతోంది. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రెండవ వారాంతం తర్వాత ఈ చిత్రం 900 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రూ. 1000 కోట్లు రాబట్టాలని మేకర్స్ ఆశిస్తున్నారు. అలా జరిగితే అది పఠాన్ ఆల్ టైమ్ కలెక్షన్‌ని అధిగమిస్తుంది.