Begin typing your search above and press return to search.

SSMB29: ఈ రెక్కలతో రాజమౌళి ప్లాన్ ఏంటి?

అసలే RRR సినిమాతో ఆస్కార్ టచ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 11:54 AM GMT
SSMB29: ఈ రెక్కలతో రాజమౌళి ప్లాన్ ఏంటి?
X

దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. SSMB29 ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలే RRR సినిమాతో ఆస్కార్ టచ్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.


వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై ఫోకస్ ఉంటుందని చెప్పవచ్చు. హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టుగా రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ లైన్ గురించి కూడా విజయేంద్ర ప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉండబోతున్నట్లుగా కొన్ని లీకులు అయితే ఇచ్చేశారు. ఇక అది ఎంతవరకు నిజం అనేది రాజమౌళి క్లారిటీ ఇస్తే కానీ తెలియదు. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు గట్టిగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వర్క్ షాప్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆలస్యం అయినప్పటికీ కూడా రాజమౌళి పక్కా ప్రణాళికతోనే ప్రాజెక్టు అప్డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం ఒక రెండు రెక్కలు కలిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తుంది. TP విజయన్ అనే విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్ట్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాడు. ఈ ఆర్టిస్ట్ ఇంతకుముందు బాహుబలి, RRR సినిమాలకు వర్క్ చేశాడు. కల్కి శకుంతలం సలార్ చంద్రముఖి 2 సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది.

ఇక ఇప్పుడు SSMB29 ప్రాజెక్టు కోసం కూడా విజయన్ విజువల్ డెవలప్మెంట్ ఆర్టిస్టుగా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతను సోషల్ మీడియాలో రెండు గోల్డెన్ రెక్కలు కలిగిన ఆర్ట్ వర్క్ ను హైలెట్ చేశాడు. SSMB29 డైరీస్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ సినిమాలో ఏదో బలమైన పాయింట్ ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది.

ఆ మధ్య ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని అన్నారు కాబట్టి గోల్డ్ హంట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ అడ్వెంచర్ గా ఉంటుందేమో అనేలా కామెంట్స్ వస్తున్నాయి. సినిమా మాత్రం రెక్కలు విప్పుకుని ప్రపంచమంతా వ్యాప్తి చెందేలా ఉంటుంది అని సంకేతాలు వస్తున్నాయి. తప్పకుండా రాజమౌళి అంచనాలకు మంచి మహేష్ బాబును ప్రజెంట్ చేస్తాడు అని చెప్పవచ్చు. ఈ అప్డేట్ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.