Begin typing your search above and press return to search.

దేవర ట్రైలర్.. వచ్చేది ఎప్పుడంటే..

ఆచార్యతో వచ్చిన డిజాస్టర్ నుంచి కోలుకొని మరల తనని తాను పాన్ ఇండియా లెవల్ లో షోకేస్ చేసుకోవాలని కొరటాల భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 4:12 AM GMT
దేవర ట్రైలర్.. వచ్చేది ఎప్పుడంటే..
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా దేవర మూవీ ఎన్టీఆర్ కెరియర్ లోనే బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొరటాల శివ కూడా ఈ చిత్రాన్ని చాలా కసిగా తెరకెక్కించారు. ఆచార్యతో వచ్చిన డిజాస్టర్ నుంచి కోలుకొని మరల తనని తాను పాన్ ఇండియా లెవల్ లో షోకేస్ చేసుకోవాలని కొరటాల భావిస్తున్నారు.

అలాగే తారక్ తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గ సక్సెస్ ని ఇవ్వాలని కొరటాల దేవరపై చాలా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దేవర సినిమా తమకి భారీ లాభాలు తీసుకొస్తుందని బయ్యర్లు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

అన్ని భాషలలో సాంగ్స్ కి ఆదరణ లభిస్తోంది. టీజర్ కి కూడా మంచి స్పందన లభించింది. ఇక దేవర రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్పీడ్ అప్ చేసే పనిలో ఉంది. వన్ బై వన్ మూవీ వీడియో కంటెంట్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 9 లేదా 10 తేదీలలో ఒక రోజు దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

రెండు రోజుల్లో ట్రైలర్ రిలీజ్ పై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ని ఈవెంట్ గా నిర్వహించే ఛాన్స్ ఉందని టాక్. అలాగే సినిమాకి రెండు వారాల ముందు నుంచి ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ప్రమోషన్స్ లోకి దిగుతారని మాట వినిపిస్తోంది. అన్ని రాష్ట్రాలు తిరిగి సినిమాని వీలైనంత బలంగా జనాల్లోకి తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. దానికి సంబంధించి ప్రమోషన్ క్యాలెండర్ కూడా సిద్ధం చేసుకున్నారంట.

దేవర మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాతనే ప్రమోషన్స్ యాక్టివ్ అవుతాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో ఫస్ట్ డేనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని తారక్ అందుకుంటాడని భావిస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కి గ్లోబల్ ఇమేజ్ వచ్చిందని కన్ఫర్మ్ అయిపోతుంది. మరి ఆ ఫీట్ ని తారక్ దేవరతో ఎంత వరకు అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.