Begin typing your search above and press return to search.

'గేమ్ చేంజర్' ట్రైలర్ సస్పెన్స్ వీడేదెప్పుడు?

ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో ఇప్పటికే ఒక పెద్ద ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:13 AM GMT
గేమ్ చేంజర్ ట్రైలర్ సస్పెన్స్ వీడేదెప్పుడు?
X

మెగా పవర్ స్టార్ కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి 2025 సంక్రాంతికి ఫిక్స్ అయింది. ఈ సినిమాకు సంబంధించి అమెరికాలో ఇప్పటికే ఒక పెద్ద ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రమోషన్ల మీద టీం దృష్టిపెట్టింది. ఐతే హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ విషయంలో అభిమానుల్లో అయోమయం నెలకొంది.

ట్రైలర్ ఈ నెలలోనే వచ్చేస్తుందని ముందు ప్రచారం జరిగింది. మొదట వినిపించిన డేట్ జనవరి 30. తర్వాత 31 అన్నారు. జనవరి 1న కొత్త ఏడాదిలో ట్రైలర్ లాంచ్ అంటూ కొత్త ప్రచారమూ నడిచింది. కానీ ఈ డేట్లేవీ వాస్తవం కాదని తెలుస్తోంది. ఏవో కారణాల వల్ల ట్రైలర్ లాంచ్ వాయిదా పడుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం జనవరి 4న ‘గేమ్ చేంజర్’ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఆశించిన బజ్ క్రియేట్ చేయలేదనే అభిప్రాయాలున్నాయి. అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఐతే సరైన ట్రైలర్ వస్తే అంతా మారిపోతుందని భావిస్తున్నారు. ట్రైలర్ చాలా చాలా కీలకంగా మారింది. అందుకే శంకర్ అండ్ టీం దాని మీద మరింత ఫోకస్ పెట్టిందని.. ఎక్కువ టైం తీసుకుని ట్రైలర్‌ను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది.

జనవరి 4న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా కొంచెం ఘనంగానే ప్లాన్ చేస్తున్నారట. విడుదలకు ఆరు రోజుల ముందు ట్రైలర్ రాబోతోంది. ఆ తర్వాత ఆంధ్రలో ప్రి రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నారు. చెన్నైలో కూడా ఆడియో వేడుక నిర్వహించబోతున్నారు. రేపో ఎల్లుండో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారట. ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.