Begin typing your search above and press return to search.

తండేల్.. మళ్ళీ ప్లాన్ చేంజ్?

ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో కీలక సన్నివేశాలని తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 11:30 PM GMT
తండేల్.. మళ్ళీ ప్లాన్ చేంజ్?
X

అక్కినేని హీరో నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో కీలక సన్నివేశాలని తెరకెక్కించారు. మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో చేపలవేటకి వెళ్లి పాకిస్థాన్ లో ఆర్మీకి ఖైదీగా చిక్కిన రాజు అనే యువకుడి నిజ జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రియల్ లైఫ్ క్యారెక్టర్ కి కాస్తా ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథనం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ‘తండేల్’ మూవీలో నాగ చైతన్య ఉత్తరాంధ్ర స్లాంగ్ లో మాట్లాడనున్నారు.

దీనికోసం మూవీ ప్రీప్రొడక్షన్ స్టేజ్ నుంచి నాగ చైతన్య గ్రౌండ్ లెవల్ కి వెళ్లి మత్స్యకారులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో చందూ మొండేటి ఉన్నారు. డిసెంబర్ 20న ‘తండేల్’ మూవీని రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ ని వాయిదా వేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం డిసెంబర్ లో ‘తండేల్’ రిలీజ్ టైంలో ఎక్కువ సినిమాలు పోటీలో ఉండటమే.

అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే దిల్ రాజు గేమ్ చేంజర్ రిలీజ్ క్రిస్మస్ కి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. దాంతో పాటుగా నితిన్ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోలో డేట్ లో రావడం బెటర్ అనే ఆలోచనలో బన్నీ వాస్ ఉన్నారంట. రామ్ చరణ్ కి పోటీగా తండేల్ ని రిలీజ్ చేసే ప్రయత్నం అల్లుఅరవింద్ చేయరని భావిస్తున్నారు.

ఒకవేళ డిసెంబర్ కుదరకపోతే జనవరి 25 లేదా 26న రిలీజ్ చేయాలనే ఆలోచనతో బన్నీ వాస్ ఉన్నారంట. రిపబ్లిక్ డే సందర్భంగా మూవీని రిలీజ్ చేస్తే హాలిడే కూడా కలిసొస్తుంది. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ నుంచి ఆడియన్స్ బయటకొస్తారు. సంక్రాంతి సినిమాల సందడి తగ్గిపోతుంది. అందుకే రిపబ్లిక్ డే హాలిడేని ఉపయోగించుకొని సోలోగానే తండేల్ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. త్వరలో దీనిపై అధికారికంగా కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.