ఐకాన్ స్టార్ తో అట్లీ ప్రాజెక్ట్ లేనట్లే!
అట్లీ సతీమణి సైతం ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే చిన్న హింట్ వదిలారు.
By: Tupaki Desk | 19 Dec 2024 7:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడనే ప్రచారం కొంత కాలంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. అట్లీ తెరకెక్కించిన 'జవాన్' సినిమా రిలీజ్ అనంతరం...బన్నీ నటించిన 'పుష్ప-2' సెట్స్ లో ఉన్న సమయంలోనే ఈ ప్రచారం మొదలైంది. అటుపై డే బై డే ఆ ప్రచారం పీక్స్ కి చేరింది. అట్లీ సతీమణి సైతం ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే చిన్న హింట్ వదిలారు. దీంతో ప్రాజెక్ట్ లాక్ అయినట్లే అనుకున్నారు.
అట్లీ స్టోరీ వినిపించినట్లు తెరపైకి వచ్చింది. కానీ వీళ్లిద్దరి మధ్యలో త్రివిక్రమ్ కూడా ఉండటంతో? ముందు అట్లీతోనా? గురూజీతోనా అన్నది డిసైడ్ చేయాల్సింది బన్నీగా తేలింది. అయితే తాజాగా అట్లీ షాక్ ఇచ్చాడు. దీంతో బన్నీతో సినిమా లేదని ఖరారైంది. తదుపరి అట్లీ తన ఆవర చిత్రాన్ని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకె క్కిస్తున్నట్లు తెలిపాడు. అలాగే ఏడవ సినిమా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో యాక్షన్ థ్రిల్లర్ ని ప్రకటించాడు.
దీంతో ఐకాన్ స్టార్ తో మూవీ అటకెక్కినట్లేనని తేలిపోయింది. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అట్లీ ఆ రెండు సినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా? మూడు నాలుగేళ్లు పడుతుంది. అదీ వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయగలిగితే. లేదంటే ఎంత సమయం అయినా పట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ రెండు సినిమాలకు ఎక్కువ సమయం తీసుకునే ఛాన్స్ ఉంది.
ఇక బన్నీ లిస్ట్ లోనూ రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. వచ్చే ఏడాది త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడు. అదే సమయంలో? `పుష్ప-3` మొదలు పెడతారా? లేక ఏడాది గ్యాప్ తీసుకుని ముందుకెళ్తారా? అన్నది తెలియాలి. `పుష్ప-3` కథ సిద్దంగా ఉంటే సెట్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే స్టోరీ కోసంమే ఏడాదిన్నర పాట వర్కౌట్ తప్పదు. మరి ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ సుకుమార్ ఎలా వేసారు? అన్నది తెలియాలి.