Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ మొత్తం యంగ్ టైగర్ చుట్టూనే

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కోలీవుడ్ లో ఎక్కువ బజ్ ఉన్న తెలుగు నాట అంతగా లేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 5:49 AM GMT
సెప్టెంబర్ మొత్తం యంగ్ టైగర్ చుట్టూనే
X

సెప్టెంబర్ నెలలో టాలీవుడ్ లో విభిన్నంగా సినిమాల సందడి మొదటి వారం నుంచే మొదలు కాబోతోంది. ఇళయదళపతి విజయ్ GOAT మూవీ ఫస్ట్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి కోలీవుడ్ లో ఎక్కువ బజ్ ఉన్న తెలుగు నాట అంతగా లేదని చెప్పొచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడి కూడా తెలుగులో పెద్దగా ఏమీ లేదు.

సెప్టెంబర్ 7న రాజ్ తరుణ్ భలే ఉన్నాడే, సుహాస్ జనక అయితే గనక సినిమాలు రిలీజ్ కానున్నాయి. సుహాస్ మూవీ దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తోన్న నేపథ్యంలో కొంత హైప్ నెలకొని ఉంది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసే ఛాన్స్ ఉంది. ట్రైలర్ కి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చిన్న సినిమాలకి ఈ మధ్య మంచి ఆదరణ వస్తోంది. ఈ నేపథ్యంలో జనక అయితే గనక కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. భలే ఉన్నాడే కూడా పాజిటివ్ టాక్ తోనే థియేటర్స్ లోకి వస్తోంది.

రెండో వారంలో మత్తు వదలరా 2, ధూమ్ ధామ్, ఉత్సవం సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. శ్రీసింహ హీరోగా గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన మత్తు వదలరాకి సీక్వెల్ గా ఈ పార్ట్ 2 వస్తోంది. సినిమాని సడెన్ గా రిలీజ్ ఎనౌన్స్ చేయడంతో పెద్దగా సౌండ్ క్రియేట్ చేయలేదు. ఫస్ట్ పార్ట్ సక్సెస్ కారణంగానే ఓ వర్గం వారి ఫోకస్ ఈ సినిమాపై ఉంది. ఇక మూడో వారంలో ఏ సినిమాలు రిలీజ్ కావడం లేదు.

అయితే సెప్టెంబర్ మొదటి వారం నుంచి జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర ప్రమోషన్స్ షురూ కానున్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ ప్రమోషన్స్ పై పూర్తిగా ఫోకస్ చేయనున్నారంట. అలాగే దేవర నుంచి సాంగ్స్, ట్రైలర్ కూడా సెప్టెంబర్ మొదటి మూడు వారాలలో ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకుల అటెన్షన్ మొత్తం దేవర సినిమాపైనే ఉండే ఛాన్స్ ఉంది.

రిలీజ్ అవుతున్న సినిమాల కంటే సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోయే దేవర పైన ఈ నెల రోజులు ఎక్కువ చర్చ జరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రతివారం దేవర నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని కాబట్టి సోషల్ మీడియా మొత్తం యంగ్ టైగర్ దేవర సందడి ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే చిన్న సినిమాల రిలీజ్ పైన కాకుండా ఎన్టీఆర్ చుట్టూనే మీడియా ఫోకస్ చేస్తుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఫ్యాన్స్ కోసం దేవర కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. బయ్యర్లు కూడా దేవరపైనే కంప్లీట్ హోప్స్ పెట్టుకున్నారు.