Begin typing your search above and press return to search.

దేవర సీక్వెల్.. విప్పాల్సిన చిక్కుముడులు ఎన్నో!!

మూడో రోజు.. సండే కావడం అండ్ దసరా సెలవులు వస్తుండడంతో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 2:30 AM GMT
దేవర సీక్వెల్.. విప్పాల్సిన చిక్కుముడులు ఎన్నో!!
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన మూవీ.. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లను రాబడుతోంది. రివ్యూలు కాస్త మిక్స్ డ్ గా వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం ఓ రేంజ్ లో సాధిస్తోంది. రెండు రోజుల్లో రూ.243 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూడో రోజు.. సండే కావడం అండ్ దసరా సెలవులు వస్తుండడంతో మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

అయితే తారక్ ఫ్యాన్స్.. దేవర సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ పార్ట్-2 గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందో లేదో ఇంకా అప్డేట్ రాలేదు. అదే సమయంలో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ప్రేక్షకుల ముందుకు వస్తుందో క్లారిటీ లేదు. కానీ మేకర్స్.. సీక్వెల్ లో అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంది. ఎన్నో చిక్కుముడులను విప్పాల్సి కూడా ఉంది. అవేంటంటే?

మూవీ స్టార్టింగ్ లో రా ఏజెన్సీ సమావేశమై.. యతి, దయ గురించి మాట్లాడుకుంటారు. పోలీస్ రోల్ లో ఉన్న అజయ్ ఎంక్వయిరీ చేస్తాడు. వారిలో యతి.. దయ ఆచూకీ చెబుతాడు. ఆ సమయంలో దయ వెతకడానికి వెళ్తే దేవర కథ.. ప్రకాష్ రాజ్ ద్వారా వినాల్సి వస్తుంది. యతి సోదరుడు దయ ఏమయ్యాడనేది ప్రశ్న? ప్రకాష్ రాజ్ పాత్రేంటి ? అదే సమయంలో సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి? అనేది మేకర్స్.. ఫస్ట్ పార్ట్ లో క్లారిటీ ఇవ్వలేదు.

సినిమాలో దేవర కుమారుడు వరను కాస్త పిరికివాడిగా చూపించారు. కానీ తన తండ్రి మరణం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలుసుకోవడానికి అతను ఏం చేశాడన్నది మేకర్స్ చెప్పలేదు. కనీసం క్లూ కూడా ఇవ్వలేదు. విలన్ భైర కుమారుడు, దేవర చెల్లెలు రోల్స్ ను జస్ట్ చూపించారు మేకర్స్. షైన్ టామ్ చాకోను ఇంటర్వెల్ సీక్వెన్స్ లో దేవర నరికినట్లు చూపించారు. ఆ తర్వాత అతను మళ్లీ కనిపిస్తాడు. ఈ విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. శ్రీకాంత్ బ్యాక్ గ్రౌండ్ ను రివీల్ చేయలేదు.

ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాలో తక్కువ సమయమే కనిపించింది. రిలీజ్ కు ముందే మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు. సెకండ్ పార్ట్ లో ఆమె రోల్ కు ఫుల్ స్కోప్ ఉంటుందని చెప్పారు. రీసెంట్ గా తారక్.. అమెరికాలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ రెండు పేజీల డైలాగ్ చెప్పినట్లు వెల్లడించారు. ఆ సీన్ పార్ట్-1లో లేదు.. కాబట్టి సీక్వెల్ లో ఉండి ఉంటుంది. మొత్తానికి కొరటాల.. సీక్వెల్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి ఉంది. మరి ఎప్పుడు పార్ట్-2ను మేకర్స్ తీసుకొస్తారో వేచి చూడాలి.