Begin typing your search above and press return to search.

దేవర 2.. స్టార్ అయ్యేది ఎప్పుడు?

ఒకవేళ ఆ స్థాయిలో వసూళ్లు అందుకుంటే మాత్రం కచ్చితంగా సినిమాతో డిస్టిబ్యూటర్స్ కి భారీ లాభాలు వచ్చినట్లే అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   8 Oct 2024 5:15 AM GMT
దేవర 2.. స్టార్ అయ్యేది ఎప్పుడు?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. 10 రోజుల్లోనే ఏకంగా 466 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ మూవీ అందుకుంది. దసరా సెలవులు కలిసి రానున్న నేపథ్యంలో 600 కోట్ల వరకు వసూళ్లు సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆ స్థాయిలో వసూళ్లు అందుకుంటే మాత్రం కచ్చితంగా సినిమాతో డిస్టిబ్యూటర్స్ కి భారీ లాభాలు వచ్చినట్లే అని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ఈ సినిమా సక్సెస్ దిశగా అడుగులు వేయడంతో ‘దేవర 2’ పైన అంచనాలు భారీగా పెరిగాయి. కచ్చితంగా మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ లో రెట్టింపు యాక్షన్ సీక్వెల్స్, పవర్ ఫుల్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయని కొరటాల శివ కూడా పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ చూడటానికి మెజారిటీ ఆడియన్స్ ‘దేవర’ మూవీకి వెళ్తున్నారు. తండ్రి కొడుకులుగా రెండు పాత్రలలో కూడా తారక్ పూర్తిస్థాయిలో ఆడియన్స్ ని సంతృప్తి పరిచాడు. ఈ నేపథ్యంలో ‘దేవర 2’ పైన ఫ్యాన్స్ కి ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ డిసెంబర్ లో స్టార్ట్ చేస్తారని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. కొరటాల శివ కూడా ‘దేవర పార్ట్ 2’ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకో సినిమాకి వెళ్లాలని అనుకుంటున్నారు. వీలైనంత వేగంగా మూవీ స్టార్ట్ చేస్తామని ఇంటర్వ్యూలో కొరటాల శివ, ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్ ప్రకారం 2025 అక్టోబర్ లో ‘దేవర 2’ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందంట.

వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసి 2026 ఆఖరులో లేదంటే 2027 ఆరంభంలో సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘దేవర పార్ట్ 2’ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా షూట్ చేసేశారని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఒక వేళ ‘దేవర 2’ మూవీ స్టార్ట్ చేస్తే ‘డ్రాగన్’ తో పాటే ఆ మూవీ షూటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. దానికోసం ఎన్టీఆర్ లుక్ పరంగా ట్రాన్స్ ఫర్మేషన్ అవుతూ ఉండాలి. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది తెలియదు. ప్రశాంత్ నీల్ దానికి యాక్సప్ట్ చేస్తాడా అనేది కూడా వేచి చూడాలి.