Begin typing your search above and press return to search.

ది OG డే.. పవర్ స్టార్ ఇలా చేస్తాడనుకోలేదు..!

సెప్టెంబర్ 27 పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈరోజు అసలైతే ఫుల్ ఫెస్టివల్ మోడ్ లో ఉండాల్సింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 5:10 AM GMT
ది OG డే.. పవర్ స్టార్ ఇలా చేస్తాడనుకోలేదు..!
X

స్టార్ సినిమాలు సెట్స్ మీద వెళ్లేప్పుడు ముందు ఒక రిలీజ్ డేట్ అనుకోవడం ఆ డేట్ వచ్చేసరికి తూచ్ అని మరో డేట్ కి వాయిదా వేయడం చాలా కామన్. ఓ పక్క స్టార్ సినిమా వస్తుందని చిన్న సినిమాలు తమ సినిమాలను వాయిదా వేస్తుంటారు. ఇక ఫ్యాన్స్ అయితే స్టార్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయగానే ఫెస్టివల్ కి సిద్ధం అవుతుంటారు. కానీ ఆ సినిమా వాయిదా పడిందని తెలిసి డీలా పడుతుంటారు. సెప్టెంబర్ 27 పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఈరోజు అసలైతే ఫుల్ ఫెస్టివల్ మోడ్ లో ఉండాల్సింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న OG సినిమాను ఈరోజు రిలీజ్ ప్రకటించారు. ఐతే పవన్ డేట్స్ ఇష్యూ వల్ల షూటింగ్ పూర్తి కాలేదు. ఓజీ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఆయన నానితో చేసిన సరిపోదా శనివారం రిలీజ్ డేట్ తో పాటుగా పవర్ స్టార్ OG సినిమాను కూడా సెప్టెంబర్ 27 రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ షూటింగ్స్ కు టైం ఇవ్వడం కుదరక అది వాయిదా పడింది.

సెప్టెంబర్ 27 అంటే ఈరోజు వచ్చి ఉంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి ఒక రేంజ్ లో ఉండేది. కానీ సినిమా వాయిదా వేశారు. ఓజీ సినిమా రిలీజ్ దాదాపు నెక్స్ట్ ఇయర్ అని ఫిక్స్ అవ్వొచ్చు. ఐతే నేడు పవర్ స్టార్ సినిమాకు బదులుగా ఎన్టీఆర్ దేవర ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రియులంతా తారక్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ మిస్ అయినా తారక్ వచ్చాడని ప్రేక్షకులు ఖుషి అవుతున్నారు.

OG సినిమా లో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఆ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడేలా చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓజీ నెవర్ బిఫోర్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. OG కు ముందు పవర్ స్టార్ తన ఫ్యాన్స్ కు హరి హర వీరమల్లు సినిమా అందిస్తున్నారు. 2025 మార్చి 28న ఆ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.