Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్..క‌మ‌ల్ హాస‌న్ డిసైడ్ అయ్యేది ఎప్పుడో?

ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్ల బోతున్నామ‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రివీల్ చేసారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:07 AM GMT
ప్ర‌భాస్..క‌మ‌ల్ హాస‌న్ డిసైడ్  అయ్యేది ఎప్పుడో?
X

పాన్ ఇండియా చిత్రాలు 'కల్కీ 2898'..'ఇంయ‌డిన్-2' భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే 'స‌లార్' విజ‌యంతో ప్ర‌భాస్ రెట్టించిన ఉత్సాహంలోనే ఉన్నారు. అదే ఊపును క‌ల్కీతో నూ కొన‌సాగించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ప్ర‌భాస్ కెరీర్ లో తొలి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఇప్ప‌టికే సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్ల బోతున్నామ‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రివీల్ చేసారు.

ఇదే సినిమాలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. తొలిసారి క‌మ‌ల్ ప్ర‌తినాయ‌కుడిగా పాత్ర పోషిచండంతో సినిమాపై అంత‌ర్జాతీయ స్థాయిలోనే బ‌జ్ క్రియేట్ అవుతోంది. అలాగే క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య 'ఇండియ‌న్ -2' కూడా రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. అలాగే క‌ల్కీ కూడా షూటింగ్ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది.

దీంతో ఇప్పుడీ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాలు కాబ‌ట్టి ఎక్క‌డా క్లాష్ లేకుండా చూసుకోవాలి. క‌ల్కీ మేలో రిలీజ్ అవుతుంద‌ని నిర్మాత ఓసంద‌ర్భంలో అన్నారు. కానీ ఇటీవ‌లే 90 రోజుల త‌ర్వాత కల్కీ ట్రైల‌ర్ రిలీజ్ చేస్తామ‌ని ముంబైలో అనౌన్స్ చేసారు నాగ్ అశ్విన్ అంటే? అంటే మే నుంచి జూన్ మ‌ధ్య‌లో ఆ సినిమా రిలీజ్ కి అవ‌కాశం ఉంది. అలాగే ఇండియ‌న్ -2 కూడా స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉందం టున్నారు.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అనుకున్న టైమ్ కి అయిపోతే డిలే ఉండ‌దు. కాకపోతే ఈ రెండు సినిమాలు క్లాష్ కాకుండా చూసుకోవాలి. రెండు సినిమాల్లో క‌మ‌ల్ న‌టించారు కాబ‌ట్టి రిలీజ్ నిర్ణ‌యం విష‌యంలో ఆయ‌న కీల‌క భాగ‌స్వామి అవుతారు. అటు ప్ర‌భాస్ మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు. అది 50 శాతం షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇలా ఇవ‌న్నీ ఆలోచించ‌కుని డార్లింగ్ కూడా త‌న రిలీజ్ ల విష‌యంలో ఓ అంచ‌నాకి రావాల్సి ఉంటుంది.