పెళ్లిలో పవన్ ఎక్కడ? ఫ్యాన్స్ డౌట్!
అదంతా సరే.. పవన్ ఎక్కడ? ఇంతకీ పెళ్లిలో కనిపించడేం? అంటూ ఒక సెక్షన్ మీడియా సందేహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకూ వరుణ్ తేజ్- లావణ్య జంటతో పవన్ కలిసి ఉన్న ఫోటో ఒక్కటీ రిలీజ్ కాలేదు.
By: Tupaki Desk | 1 Nov 2023 3:31 PM GMTఓవైపు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరుగుతోంది. మరోవైపు ఏపీలో రాజకీయాలు వేడెక్కిపోతున్నాయ్. ఇలాంటి సమయంలో జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడ? అంటూ చర్చ సాగుతోంది. పవన్ కొన్నాళ్ల పాటు రాజకీయాలు, సినిమాలకు బ్రేక్ వేసి, ఇటీవలే తన సోదరుడు నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ టుస్కానీలో అడుగుపెట్టారు. తన భార్య అన్నా లెజినోవా సమేతంగా పవన్ ఇటలీకి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కాడు.
అయితే పవన్ టుస్కానీ బయల్దేరినప్పటి ఫోటో మినహా ఆ తర్వాత పెళ్లిలో అతడి సందడికి సంబంధించిన ఒక్క ఫోటో కూడా ఎక్కడా కనిపించలేదు. చాలా మంది సెలబ్రిటీల ఫోటోలు లీకయ్యాయి కానీ పవన్ ఫోటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి సైడ్ ప్రొఫైల్ ఫోటో ఒకటి చూసి, ఇతడే పవన్ కల్యాణ్ అంటూ కొన్ని మీడియాలు కథనాలు వేసేసాయి. కానీ నిజానికి అది పవన్ కల్యాణ్ కాదు.. మెగాస్టార్ మేకోవర్ అనంతరం కొత్త లుక్ అని అభిమానులు కనిపెట్టేశారు.
అదంతా సరే.. పవన్ ఎక్కడ? ఇంతకీ పెళ్లిలో కనిపించడేం? అంటూ ఒక సెక్షన్ మీడియా సందేహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకూ వరుణ్ తేజ్- లావణ్య జంటతో పవన్ కలిసి ఉన్న ఫోటో ఒక్కటీ రిలీజ్ కాలేదు. వారితో పాటు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ప్రముఖుల ఫోటోలు బయటపడినా కానీ పవన్ ఫోటో మాత్రం బయటికి రాలేదు. అసలు ఈ పెళ్లిలోనే ఉన్నాడా లేడా? అన్న సందేహం అందరికీ కలుగుతోంది. హల్దీ, మెహందీ, కాక్ టైల్ పార్టీకి సంబంధించిన ఫోటోలు లీకైనా కానీ వీటిలో ఎక్కడా పవన్ కల్యాణ్ కనిపించకపోయేసరికి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. కనీసం ఒక ఫోటో అయినా వదలండయ్యా! అంటూ పవన్ అభిమానులు వెర్రెక్కిపోవడం వెబ్ లో కనిపిస్తోంది. ఇంతకీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎక్కడ?