కల్కి ఎఫెక్ట్.. వార్తల్లోకి రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్!
అందుకే సోషల్ మీడియాలో ప్రస్తుతం 'మహాభారతం' టాపిక్ డిస్కషన్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 29 Jun 2024 1:30 PM GMTఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి 2898 ఏడీ' గురించే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొన్న గురువారం విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. హిందూ పురాణాలకు భవిష్యత్ ప్రపంచాన్ని ముడిపెడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఫ్యూచరిస్టిక్ సినిమా ఇది. మహాభారతం కురుక్షేత్ర యుద్ధంతో మొదలై, 6000 సంవత్సరాల తర్వాత కల్కి అవతారం గురించి వివరించే కథాంశమిది. అందుకే సోషల్ మీడియాలో ప్రస్తుతం 'మహాభారతం' టాపిక్ డిస్కషన్ లోకి వచ్చింది.
ఇండియన్ మైథలాజీలోని ఐకానిక్ పాత్రలు ఫ్యూచర్ వరల్డ్ లోకి వస్తే ఎలా ఉంటుందనేది ఊహించి 'కల్కి' చిత్రాన్ని తెరకెక్కించారు. ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రను ప్రధానంగా హైలైట్ చేశారు. ఆ క్యారక్టర్ తో ఉత్తర, అర్జునుడు, కృష్ణుడు, కర్ణుడులకు మధ్య జరిగే కీలక సన్నివేశాల్ని చూపించారు. మహాభారతంలోని ఘట్టాలను కొన్ని నిమిషాలే చూపించినా, ఆ సీక్వెన్సులు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసాయి. నాగ్ అశ్విన్ పనితనాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికే ఇలా ఉంటే, రాజమౌళి 'మహాభారతం' తీస్తే ఇంకెలా ఉంటుందో అని కామెంట్లు చేస్తున్నారు.
'మహా భారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఎప్పటికైనా ఈ ఎపిక్ డ్రామాని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తానని చెబుతూ వస్తున్నారు. దీని కోసం 'బాహుబలి' కంటే పది రెట్లు ఎక్కువగా కష్టపడాలని, సినిమా తీయడానికి పదేళ్ల సమయం పడుతుందని ట్రిపుల్ ఆర్ టైంలో అన్నారు. అయితే ఇప్పుడు 'కల్కి 2898 AD' విడుదలైన తర్వాత, జక్కన్న వీలైనంత త్వరగా మహాభారతాన్ని తెర పైకి తీసుకురావాలని సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
పాన్ ఇండియాకి బాటలు వేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి.. ఎలాంటి జోనర్ నైనా హ్యాండిల్ చెయ్యగలరు. RRR తో తెలుగు సినిమాని ఆస్కార్ వరకూ తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'SSMB 29' మూవీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. దీని తర్వాత జన్నక్క 'మహాభారతం' ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే రాజమౌళి అయితేనే, అలాంటి గొప్ప ఇతిహాసానికి న్యాయం చేయగలరని భావిస్తున్నారు.
రాజమౌళి మార్క్ యాక్షన్, ఎలివేషన్లు, ఎమోషన్లు కలబోసి.. అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని భారతాన్ని గ్రాండియర్ గా తెరకెక్కిస్తే నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. హిందువులు పంచమ వేదంగా భావించే ఇతిహాసం మహాభారతంలోని అధ్యాయాలను తీసుకొని ఇప్పటికే అనేక సినిమాలను, సీరియల్స్ ను రూపొందించారు. కానీ ఈ జనరేషన్ లో భారతాన్ని గొప్పగా ఆవిష్కరించిన చిత్రాలు లేవు. మరి జక్కన్న అతి త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తాడేమో చూడాలి.