దసరా కాంబో జాన్విని మెప్పించారా..?
కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు మామూలుగా లేవు.
By: Tupaki Desk | 16 July 2024 9:12 AM GMTబాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల కాలంలో టాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు ఆమె తెలుగులో అగ్ర హీరోలతో అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు మామూలుగా లేవు.
ఇది తనకు పర్ఫెక్ట్ టాలీవుడ్ డెబ్యూ అని ఆమె ఇంటర్వ్యూలలో కూడా తెలియజేసింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. ఇందులో కూడా ఆమె చాలా డిఫరెంట్ పాత్రలో కనిపించబోతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దేవర సినిమా 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్లో రూపొందుతుండగా రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్టు కూడా అదే రేంజ్ లో రూపొందుతోంది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టులలో అవకాశం దక్కించుకున్న తర్వాత అమ్మడు ఆ తరువాత అంతకుమించి అనేలా మరో ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా ఈ బ్యూటీ అంతకంటే తక్కువ బడ్జెట్ లో ఆఫర్స్ వస్తున్నా కూడా ఓకే చెబుతోందట.
ఇక 150 కోట్ల బడ్జెట్ లో రాబోయే నాని సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా టాక్ వస్తోంది. దసరా సినిమాతో సక్సెస్ అందుకున్న తర్వాత మళ్లీ అదే కాంబినేషన్లో శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మొదట ఈ ప్రాజెక్టులో కోసం కొంతమంది స్టార్ హీరోయిన్స్ ను అనుకున్నప్పటికీ మళ్లీ ఫైనల్ గా జాన్వీ పైనే ఫోకస్ పెంచారు.
ఇక డేట్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ మళ్లీ ఆ తర్వాత అమ్మడు ఆలోచించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. నిజంగానే దసరా కాంబినేషన్ జాన్వీ ని మెప్పించారా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక జాన్వీకి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.
అయితే బ్యూటీ ఇప్పుడు మాత్రం మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటోంది. రెమ్యునరేషన్ 3 నుంచి 4 కోట్ల మధ్యలో ఆఫర్ చేస్తున్నా తొందర పడడం లేదట. మినిమం సక్సెస్ లు అందుకొని తన రేంజ్ ను పెంచుకోవాలని అనుకుంటుంది. అందుకే బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరి రాబోయే ప్రాజెక్టులో ఈ బ్యూటీకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.