Begin typing your search above and press return to search.

నెక్స్ట్ ₹1000 కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరు..?

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏడుగురు దర్శకులు మాత్రమే వెయ్యి కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో చేరారు.

By:  Tupaki Desk   |   19 Dec 2024 5:30 AM GMT
నెక్స్ట్ ₹1000 కోట్ల క్లబ్ లో చేరే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరు..?
X

ఇండియన్ సినిమాలో ప్రతీ స్టార్ ఫిలిం మేకర్ టార్గెట్ 1000 కోట్ల క్లబ్. బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు అదే బెంచ్ మార్క్ గా మారిపోయింది. అందరూ దాన్ని క్రాస్ చేయాలనే లక్ష్యం పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. ఆ విషయంలో ఇప్పటికే కొందరు డైరెక్టర్స్ విజయం సాధించగా.. మరికొందరు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఏడుగురు దర్శకులు మాత్రమే వెయ్యి కోట్ల మైల్ స్టోన్ క్లబ్ లో చేరారు.

₹1000 కోట్ల క్లబ్ కు బాటలు వేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.. 'బాహుబలి 2', RRR సినిమాలతో రెండుసార్లు ఈ ఫీట్ అందుకున్నారు. 'కల్కి 2898 AD' మూవీతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించారు. లేటెస్టుగా 'పుష్ప 2: ది రూల్' బి.సుకుమార్ కూడా 1000 కోట్ల మార్క్ ను అధిగమించారు. ఇలా టాలీవుడ్ నుంచి వంటి ముగ్గురు దర్శకులు ప్రతిష్టాత్మకమైన క్లబ్ లో జాయిన్ అయ్యారు.

'దంగల్' సినిమాతో హిందీ దర్శకుడు నితీష్ తివారీ, 'KGF చాప్టర్-2' మూవీతో కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'పఠాన్'తో బాలీవుడ్ ఫిలిం మేకర్ సిద్దార్థ్ ఆనంద్, 'జవాన్' లాంటి హిందీ సినిమాతో తమిళ దర్శకుడు అట్లీ.. బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే వీరి తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే స్తతా ఉన్న డైరెక్టర్స్ ఎవరనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

'యానిమల్' సినిమాతో 1000 కోట్ల క్లబ్ దరిదాపుల్లోకి వెళ్లి ఆగిపోయిన టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. వచ్చే ఏడాది ప్రభాస్ తో చేయబోయే 'స్పిరిట్' మూవీతో తప్పకుండా ఆ బెంచ్ మార్క్ ను క్రాస్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ తో 'కూలీ' మూవీని తెరకెక్కిస్తున్న కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూడా వెయ్యి కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అల్లు అర్జున్ తో భారీ స్కేల్ లో సినిమా ప్లాన్ చేస్తున్న తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ రేసులో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'వార్ 2' సినిమా వచ్చే ఏడాది 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు. అదే జరిగితే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వెయ్యి కోట్ల డైరెక్టర్ అనిపించుకుంటాడు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'కింగ్' మూవీతో సుజయ్ ఘోష్ కూడా ఈ లిస్టులో చేరుతారని అంటున్నారు. యశ్ తో 'టాక్సిక్' సినిమా చేస్తున్న డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ సైతం మైల్ స్టోన్ క్లబ్ చేరడానికి ఛాన్స్ ఉంది. 'కాంతార‌ చాప్టర్ 1' కంటెంట్ నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే, డైరెక్టర్ కమ్ యాక్టర్ రిషబ్ శెట్టి కూడా ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది. మరి పైన చెప్పుకున్న వారిలో ఎవరెవరు ₹1000 కోట్ల క్లబ్ లో చేరుతారో వేచి చూడాలి.