Begin typing your search above and press return to search.

క్లాష్ లో వస్తున్న ఆ 'ఇద్దరు' సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా?

కాకపోతే అదే రోజున 'డబుల్ ఇస్మార్ట్' రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది.

By:  Tupaki Desk   |   3 Aug 2024 1:30 AM GMT
క్లాష్ లో వస్తున్న ఆ ఇద్దరు సక్సెస్ ట్రాక్ ఎక్కుతారా?
X

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం "మిస్టర్ బచ్చన్". హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయమవుతోంది. సిద్ధూ జొన్నలగడ్డ క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఆగస్ట్ 15న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. కాకపోతే అదే రోజున 'డబుల్ ఇస్మార్ట్' రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది.

ఉస్తాద్ రామ్ పొతినేని, డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఇస్మార్ట్ శంకర్ స్వీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తారీఖున విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే నిర్మాతలు ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు 'మిస్టర్ బచ్చన్' మూవీని కూడా అదే డేట్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో రెండు క్రేజీ చిత్రాల మధ్య క్లాష్ అనివార్యమైంది. అయితే కచ్ఛితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితుల్లో, ఇలా క్లాష్ లో వస్తుండటంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి.

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలుగా చేసుకుంటూ వస్తున్న రవితేజ.. గత ఏడాది కాలంలో హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నారు. 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు', 'ఈగల్' వంటి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. దీంతో ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మూవీతో తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తున్నారు.

మరోవైప హరీష్ శంకర్ నుంచి సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లు దాటిపోయింది. మధ్యలో కరోనా పాండమిక్ రావడం, చాలా కాలంగా వర్క్ చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ లేట్ అవ్వడం వల్ల దర్శకుడి కెరీర్ లో ఈ గ్యాప్ వచ్చిందని అనుకోవాలి. కారణాలు ఏవైనా హరీశ్ ఇప్పుడు మంచి విజయం సాధించి తాను ఎలాంటి కమర్షియల్ డైరెక్టర్ అనేది చూపించాల్సిన అవసరముంది. అలా జరిగితే ఏపీ డిప్యూటీ సీఎంతో చేసే సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి.

సో 'మిస్టర్ బచ్చన్' సినిమా రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరికీ కీలకమనే చెప్పాలి. ఇది 'రైడ్' అనే హిందీ మూవీకి రీమేక్ గా రూపొందింది. పేరుకి రీమేక్ అయినప్పటికీ తన మార్క్ మార్పులు చేర్పులు ఎన్నో చేశారు డైరెక్టర్ హరీష్. 'దబ్బంగ్‌'ని 'గబ్బర్‌ సింగ్‌'గా, 'జిగర్తాండ'ను 'గద్దలకొండ గణేష్‌'గా మార్చినట్లుగానే.. ఈ చిత్రానికి కూడా చాలా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించారు. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి ఎంటర్టైనర్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారో, అలాంటి చిత్రాన్నే తీసినట్లు ప్రమోషనల్ కంటెంట్ తోనే హామీ ఇచ్చారు.

రైడ్ అనేది వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఒక ఒక ఇంటెన్స్ డ్రామా. ఇందులో అజయ్ దేవగన్, ఇలియానా భార్యా భర్తలుగా నటించారు. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా తన స్టైల్ లోకి మార్చేశారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్, రొమాన్స్, డ్యూయెట్ సాంగ్స్, ఎలివేషన్ ఫైట్స్.. ఇలా అన్ని అంశాలను కలబోసి కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేశారు. ఇప్పటికైతే ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'డబుల్ ఇస్మార్ట్' తో పోటీ బలంగా ఉన్నప్పటికీ విజయం పట్ల దర్శక హీరోలు నమ్మకంగా ఉన్నారు.

మిస్టర్ బచ్చన్ సినిమా హిట్టయితే అందరూ హరీశ్ శంకర్, రవితేజల ప్రయత్నాన్ని అభినందిస్తారు. కానీ రిజల్ట్ తేడా కొడితే మాత్రం, ఇద్దరూ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి చిత్రాన్ని రీమేక్ చేసి చెడగొట్టారనే కామెంట్లు వస్తాయి. ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజుల్లో అసలు రీమేక్ సినిమాలు ట్రై చేయడమే తప్పని అందరూ విశ్లేషిస్తారు. మరి ఇండిపెండెన్స్ వీక్ లో బాక్సాఫీసు దగ్గర ఏం జరుగుతుందో చూడాలి.