స్టార్ హీరోని పరుగులెట్టిస్తున్నారుగా!
కొన్ని రోజులు గా ఎక్కడా గ్యాప్ లేకుండా విజయ్ షూట్ లో పాల్గోంటున్నాడు
By: Tupaki Desk | 9 Jan 2024 3:30 AM GMT`లియో` తో భారీ సక్సెస్ అందుకున్న తలపతి విజయ్ `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అభిమానుల్ని కాస్త నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఇందులో విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
కొన్ని రోజులు గా ఎక్కడా గ్యాప్ లేకుండా విజయ్ షూట్ లో పాల్గోంటున్నాడు. అయితే తదుపరి షెడ్యూల్స్ కూడా అంతే టైట్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే చెన్నై షెడ్యూల్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో నెలాఖరు నుంచి శ్రీలంకలోమరో షెడ్యూల్ మొదలు పెడతారు. అది పూర్తియిన వెంటనే రాజాస్తాన్ లో ఓ షెడ్యూల్ చేస్తారుట. దీనిలో భాగంగా పోరాట సన్నివేశాలతో పాటు..కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.
ఈ రెండు షెడ్యూళ్లు ముగించుకుని యూనిట్ ఇస్తాంబుల్ బయల్దేరనుందిట. ఇలా వెంట వెంటనే షెడ్యూల్ వేయడం వెనుక ఓ కారణం ఉంది. ఎట్టిపరిస్థితుల్లో మార్చికల్లా చిత్రీకరణ మొత్తం పూర్తిచేసి విజయ్ ని ప్రీగా వదిలేయాలన్నది ప్లాన్. ఆయన తదుపరి సినిమాలు ఆర్డర్ ప్రకారం జరగాలంటే? షెడ్యూల్స్ అన్నీ పక్కాగా పూర్తి కావాల్సిందే. అటుపై విజయ్ డబ్బింగ్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారుట.
మొత్తంగా విజయ్ ని చిత్ర దర్శకుడు అయితే పరుగులు పెట్టిస్తున్నట్లే కనిపిస్తుంది. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇంతవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇస్తాంబుల్ వెళ్లే ముందు కొద్ది రోజులు విరామం ఇచ్చే అవకాశం ఉందని యూనిట్ వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.