Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : షాకింగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్..!

రెండో ప్రోమోలో బిగ్ బాస్ అర్ధరాత్రి సైరెన్ మోగించి హౌస్ మెట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని అంటాడు.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:43 PM GMT
బిగ్ బాస్ 8 : షాకింగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. బయటకు వచ్చిన స్టార్ కంటెస్టెంట్..!
X

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఆదివారమే హోస్ట్ నాగార్జున క్లూ ఇచ్చారు. ఐతే మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైనట్టు సమాచారం. ఈరోజు ఆ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేస్తారు. ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్ ప్రోమో 1 లో చీఫ్ సెలక్షన్ కు సంబందించిన డిస్కషన్ చూపించారు. రెండో ప్రోమోలో బిగ్ బాస్ అర్ధరాత్రి సైరెన్ మోగించి హౌస్ మెట్స్ లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని అంటాడు. ఐతే ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ ఓటింగ్ లో ఉన్న విష్ణు ప్రియ, ఆదిత్య ఓం, నైనికల నుంచి ఒకరిని హౌస్ నుంచి పంపించేందుకు మిగతా కంటెస్టెంట్స్ ఓట్ వేయాలని బిగ్ బాస్ అన్నాడు.

అలా బిగ్ బాస్ ఆర్డర్ మేరకు ఆదిత్య ఓం కే ఎక్కువ మంది ఓట్ వేశారు. అలా ఆయన హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. తెలుగులో ఒకప్పటి హీరో అయిన ఆదిత్య ఓం తిరిగి మళ్లీ తెలుగు ఆడియన్స్ తో టచ్ లోకి వచ్చేందుకు బిగ్ బాస్ కు వచ్చారు. ఐతే అతను టాస్కుల్లో పర్వాలేదు అన్నట్టు ఉన్నా హౌస్ మేట్స్ తో కలిసిపోవడం లో మాత్రం కాస్త వెనకపడ్డారు.

బిగ్ బాస్ సీజన్ 8 లో ఐదు వారాలు అఫ్కోర్స్ రెండు రోజుల్లో ఐదు వారాలు ముగుస్తుంది అనగా ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. ఐతే ఇదివరకు సీజన్లలా హౌస్ మెట్స్ ఎలిమినేట్ చేశారంటే అతన్ని సీక్రెట్ రూమ్ కు తీసుకెళ్తారని అంటే పొరబడినట్టే. ఈసారి డైరెక్ట్ గా ఎలిమినేషన్ కే ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. అందుకే బిగ్ బాస్ టీం బుధవారం కొద్దిసేపు ఓటింగ్ ప్రక్రియను కూడా నిలిపివేశారు.

ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 8 లో ఆదిత్య ఓం ఎలాంటి పెద్ద థ్రిల్స్ లేకుండానే వెళ్తున్నాడు. తన పని తాను చేసుకుంటూ కాం అండ్ కంపోజింగ్ గా ఉన్నాడు. అదే అతనికి మైనస్ అయ్యింది. ఐతే ఇక మీదట హౌస్ లో ఉండాలంటే వారు అన్ని విధాలుగా బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యాడు. మరి వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుందా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.