Begin typing your search above and press return to search.

సినిమాలు వదిలేయాలని నయన్ ను బలవంతం చేసిన ఆ వ్యక్తి ఎవరు?

ఇప్పుడు డాక్యుమెంటరీలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Nov 2024 10:57 AM GMT
సినిమాలు వదిలేయాలని నయన్ ను బలవంతం చేసిన ఆ వ్యక్తి ఎవరు?
X

లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూపొందించిన ఫిల్మ్.. అగ్ర కథానాయిక 40వ బర్త్ డే స్పెషల్ గా సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ లోని కొన్ని కీలక ఘట్టాలను చూపించారు. ఆమె ఎదుర్కొన్న కష్టాలు, సినీ జర్నీలో ఒడిదుడుకులు, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం, వివాహ బంధంలో అడుగుపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇప్పుడు డాక్యుమెంటరీలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

'అతను' తనను సినిమాలను వదిలేయాలని బలవంతం చేశాడని, తనకు ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదని నయనతార తన డాక్యుమెంటరీలో వెల్లడించింది. అయితే యాక్టింగ్ నుంచి పూర్తిగా బ్రేక్ తీసుకోవాలని తనని ఫోర్స్ చేసాడని ఆరోపించింది కానీ, ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. తన కెరీర్ ను శాసించాలని చూసిన ఆ పర్సన్ ఎవరనేది హింట్ ఇవ్వలేదు. తన జీవితాన్ని కంట్రోల్ చేయాలని అనుకున్న వ్యక్తి గురించి నయన్ చెప్పనప్పటికీ, 'అతను' ఎవరు అని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆరాలు తీస్తున్నారు. వివాదం అవుతుందనే ఆ వివరాలు ఆమె బయటపెట్టలేదేమో అని భావిస్తున్నారు.

నిజానికి న‌య‌న‌తార కేవ‌లం సినిమాలతో వార్తల్లో నిలిచిన హీరోయిన్ కాదు. గతంలో ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో హీరో శింబుని ముద్దాడుతూ దిగిన ఫొటోలు బయటకు రావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. శింబుతో కొన్నేళ్లు డేటింగ్ చేసిన తర్వాత అతడితో బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత ప్ర‌భుదేవాతో ప్రేమ‌బంధం సాగించింది. అప్ప‌టికే పెళ్లై పిల్లలున్న వ్యక్తితో లవ్ అఫైర్ కావడంతో చాలా ఏళ్ళు వార్తల్లో నిలిచింది. నయన్ కోసమే ప్ర‌భుదేవా త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడని టాక్ ఉంది.

ప్రభుదేవాతో చాలా కాలం ప్రేమ వ్య‌వ‌హారం నడిపిన నయనతార.. ఆ సమయంలో సినిమాల‌కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించింది. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అనుకుంటున్న టైంలో, ప్రభుదేవాతో రిలేషన్ షిప్ ని నయన్ బ్రేక్ చేసుకోవడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయిన సీనియర్ హీరోయిన్.. ప్రస్తుతం పొలిటిషియన్ గా రాణిస్తున్న ఓ హీరోతోనూ ఆమె డేటింగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి. కాకపోతే దీనికి బలాన్ని చేకూర్చే విషయాలేవీ బయటకు రాకపోవడంతో.. ఈ వ్యవహారం పెద్దగా వార్తల్లో నిలవలేదని తమిళ వర్గాలు చెబుతుంటాయి.

చివరకు 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది నయనతార. ఆరేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట 2022లో వివాహం చేసుకున్నారు. స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో ఇద్దరు పిల్ల‌ల‌కు కూడా జన్మనిచ్చారు. 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' వస్తుందని అన్నప్పుడు, ఆమె పర్సనల్ లైఫ్ లోని అన్ని అంశాలను ప్రస్తావిస్తారా? వాస్తవాలు ఉంటాయా? సినీ అభిమానులు ఆలోచించారు. అయితే రిలీజ్ కు ముందు హీరో ధనుష్ తో విబేధాలను తెర మీదకు తీసుకొచ్చింది కానీ, డాక్యుమెంటరీలో మాత్రం వివాదాలను పెద్దగా ప్రస్తావించలేదు. అతను సినిమాలు మానేయమని బలవంతం చేసాడని చెప్పింది కానీ, ఆ వ్యక్తి ఎవరనేది నయన్ వెల్లడించలేదు.