Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్‌తో ఒక్క‌ ఛాన్స్ పాజిబులేనా?

ఆ ఇద్ద‌రి కెరీర్ సుదీర్ఘ ర‌న్ తో విజ‌య‌వంతంగా కొన‌సాగినా ఎందువ‌ల్ల‌ క‌లిసి ప‌ని చేయ‌లేదు?

By:  Tupaki Desk   |   19 Sep 2024 1:30 AM GMT
ప్ర‌భాస్‌తో ఒక్క‌ ఛాన్స్ పాజిబులేనా?
X

అనుష్క‌శెట్టి.. త‌మ‌న్నా భాటియా.. త్రిష‌.. కాజ‌ల్.. అన్షు.. శ్ర‌ద్ధా క‌పూర్.. దిశా ప‌టానీ.. ఇలా చాలామంది అగ్ర‌క‌థానాయిక‌లు టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టించారు. కానీ ఈ లిస్ట్ లో ప్ర‌తిభావంతురాలైన‌ స‌మంత పేరు ఎందుకు లేదు? ఆ ఇద్ద‌రి కెరీర్ సుదీర్ఘ ర‌న్ తో విజ‌య‌వంతంగా కొన‌సాగినా ఎందువ‌ల్ల‌ క‌లిసి ప‌ని చేయ‌లేదు?

ఇలాంటి ఎన్నో సందేహాలు అభిమానుల‌కు ఉన్నాయి. కానీ ఆ ఇద్ద‌రికీ న‌డుమ అలా సెట్ కాలేదు అంతే! అయితే హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌భాస్ చిత్రంలో స‌మంత న‌టిస్తే బావుంటుంద‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. సోష‌ల్ మీడియాల్లో దీనికి డిమాండ్లు ఊపందుకున్నాయి. కానీ స‌మంత‌కు ఇంకా అలాంటి ఛాన్స్ దొర‌క‌డం సులువు కాద‌ని తేలిపోయింది.

దీనికి కార‌ణం ఇప్ప‌టికే ప్ర‌భాస్ స‌ర‌స‌న ఇద్ద‌రు క‌థానాయిక‌లు ఎంపిక‌య్యార‌ని తెలిసింది. ఇంత‌కుముందే ఒక హీరోయిన్ గా ఇమాన్విని ఎంపిక చేసారు. తాజా స‌మాచారం మేర‌కు.. రెండో హీరోయిన్ ని ఓకే చేసేశారు.. కానీ స‌మంత‌ను న‌టింప‌జేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. ఇప్ప‌టికి సామ్ కి నో ఛాన్స్! అని స‌రిపెట్టుకోవాల్సి ఉంది. ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత మారుతితో రాజా సాబ్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లింది. త‌దుప‌రి స‌లార్ 2లోను ప్ర‌భాస్ న‌టించాల్సి ఉంది. మ‌రోవైపు స‌మంత సొంత బ్యాన‌ర్ సినిమా గోల్డ్ లో న‌టిస్తోంది. సిటాడెల్ హ‌నీ బ‌న్నీ స్ట్రీమింగుకి రావాల్సి ఉంది. ఇత‌ర సినిమాల వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.