Begin typing your search above and press return to search.

బంగారు బొమ్మలా ముద్దుగా ఉన్న ఈ చిట్టి పాప ఎవరో గుర్తుపట్టారా?

ఎవరికి ఎక్కడ యాక్టర్లకు సంబంధించిన పాత ఫోటోలు దొరికిన వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 2:30 PM GMT
బంగారు బొమ్మలా ముద్దుగా ఉన్న ఈ చిట్టి పాప ఎవరో గుర్తుపట్టారా?
X

గత కొద్దికాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల కొత్త ఫోటోలతో పాటు వారి చిన్ననాటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని స్పెషల్ మూమెంట్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్టార్ యాక్టర్స్ బయోగ్రఫీ, వారి బ్యాగ్రౌండ్ కి సంబంధించిన ఎన్నో విషయాలపై నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరికి ఎక్కడ యాక్టర్లకు సంబంధించిన పాత ఫోటోలు దొరికిన వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే ఇప్పుడు ట్రెండీగా ఉన్న హీరో హీరోయిన్ల పాత ఫోటోల లిస్టులో మరొక హీరోయిన్ చిన్ననాటి ఫోటో చేరిపోయింది. బోసినవ్వులతో ముద్దుగా కనిపించే ఓ చిన్ని పాప ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ని ఏలుతోంది. కామెడీ నుంచి హారర్ వరకు.. ఎమోషన్ నుంచి సెంటిమెంట్ వరకు ప్రతి పాత్రలో అదరగొట్టి ప్రేక్షకులను మైమరిపిస్తుంది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న ఆ బుజ్జి పాప ఎవరో కాదు మన జేజమ్మ.

ఇక ఈ ఫోటోలు అనుష్క తో పాటు ఉన్న ఇద్దరు పిల్లలు ఆమె బ్రదర్స్. 2005లో విడుదలైన నాగార్జున సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన స్వీటీ తెలుగు ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఒక్క తెలుగు ఇండస్ట్రీ కే పరిమితం కాకుండా ఈ బ్యూటీ సౌత్ ని మొత్తాన్ని తన టాలెంట్ తో పడగొట్టేసింది.

అనుష్క మ్యాజిక్ ఎలాంటిది అంటే ఎప్పుడు హీరోయిన్స్ ని రిపీట్ చేయని రాజమౌళి తో ఆమె మూడు సినిమాలలో నటించింది. బాహుబలి మూవీ తో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. హీరోలతో కలిసి నటించే సినిమాలకే కాకుండా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో కూడా అనుష్క తనదైన ముద్ర వేసింది. భాగమతి, అరుంధతి లాంటి చిత్రాలలో తన నట విశ్వరూపాన్ని చూపించింది. తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం అనుష్క రెండు చిత్రాల షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఘాటి’తో పాటు మలయాళం ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ‘కథనార్ – ది వైల్డ్ సార్సరర్’లో అనుష్క నటిస్తోంది.