Begin typing your search above and press return to search.

పాట‌పై హ‌క్కు కేవ‌లం నిర్మాత‌కేనా?

ఆయ‌న సినిమాలో పాట‌ల్ని ఆయ‌న అనుమ‌తి లేకుండా ట్యూన్లు వాడుకున్నా? ఇళ‌యారాజా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న సంద‌ర్భాలుకూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 March 2025 12:01 PM IST
పాట‌పై హ‌క్కు కేవ‌లం నిర్మాత‌కేనా?
X

పాట విష‌యంలో పూర్తి స్థాయి హ‌క్కు ఎవ‌రికి ఉంటుంది? అన్న దానిపై చాలా కాలంగా చాలా సందేహా లున్నాయి. ఈ విష‌యంలో ఆ హ‌క్కు నాదేనంటూ సంగీత దిగ్గ‌జం ఇళ‌య‌రాజా చాలాసార్లు బాణీ వినిపించారు. నా పాట‌..నా హ‌క్కు అనే నినాదాన్ని ఆయ‌న తీసుకొచ్చారు. ఆయ‌న సినిమాలో పాట‌ల్ని ఆయ‌న అనుమ‌తి లేకుండా ట్యూన్లు వాడుకున్నా? ఇళ‌యారాజా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకున్న సంద‌ర్భాలుకూడా ఉన్నాయి.

అయితే కొంద‌రు గాయ‌నీ గాయ‌కులు పాట‌పై రాయ‌ల్టీ కావాలంటున్నారు. నిర్మాత‌లైతే ఆ హ‌క్కు మా దేన‌ని వాదిస్తున్నారు. అలా పాట‌పై హ‌క్కు ఎవ‌రికి క‌లిగి ఉంటుంది? అన్న దానిపై కొంత అస్ప‌ష్ట‌త అయితే ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా చెన్నైకి చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్ మార్క్ అసోసియేష‌న్ స‌హ‌కారంతో క్రియాలా, ఐపీ అండ్ మ్యూజిక్ సంస్థ‌లు ఓ స‌మావేశంలో వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసాయి. థింక్ మ్యూజిక్ ఇండియా సంతోష్.. గాయ‌కుడు హ‌రి చ‌ర‌ణ్ శ్రీనివాస్ లు ఇందులో పాల్గొన్నారు.

దీని గురించి క్రియాలా సంస్థ నిర్వాహ‌కుడు, లాయ‌ర్ భ‌ర‌త్ కొంత వివ‌ర‌ణ ఇచ్చారు. పాట రూపొందా లంటే గీత ర‌చ‌యిత‌, గాయ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, సౌండ్ ఇంజ‌నీర్ ఇలా కొంత మంది కృషి కీల‌క‌మైన‌ది. అయితే వీట‌న్నింటికి మూలం నిర్మాత. ఆయ‌న పెట్టుబ‌డి పెడితేనే పాట త‌యార‌వుతుంది. అంతా ఒక‌చోట జ‌మ అవుతారు. అందుకు కార‌ణం నిర్మాత‌. పాట‌కు మొద‌టి హ‌క్కు దారుడు నిర్మాత మాత్ర‌మే.

ఒక‌వేళ ఒప్పందం ఉంటే అందులో నిబంధ‌న ప్ర‌కారం ఇత‌రుల‌కు హ‌క్కులు ఉంటాయి. అలాంటి ఒప్పందం లేకపోతే ఆ హ‌క్కు నిర్మాత‌కే చెల్లుతుంది. ఒక‌వేళ చిత్ర నిర్మాత క‌నుక చ‌నిపోతే? ఆ రైట్స్ ఆయ‌న కుటుంబానికి మాత్ర‌మే చెందుతాయ‌న్నారు. మ‌రి దీనిపై ఇళ‌య‌రాజా ఎలా స్పందిస్తారో చూడాలి.