ఈ కొట్లాట అంతా సెకండ్ ప్లేస్ కోసమేనా..?
ఐతే టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ గురించి కాదు మిగతా హీరోయిన్స్ అంతా కూడా సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2025 11:30 PM GMTటాలీవుడ్ లో లీడింగ్ లో ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది కన్నడ భామ రష్మిక మందన్న. కన్నడ నుంచి తెలుగు షిఫ్ట్ అయిన అమ్మడు ఇక్కడ తన టాలెంట్ చూపించి స్టార్ ఛాన్సులు అందుకుంది. ఇక టాలీవుడ్, కోలీవుడ్ లో సత్తా చాటిన అమ్మడికి బాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. అక్కడ మొదటి రెండు సినిమాలు జస్ట్ ఓకే అనిపించినా యానిమల్ సినిమాతో అదరగొట్టేసింది. ఆ తర్వాత పుష్ప 2 సినిమా గురించి తెలిసిందే. ఐతే టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ ప్లేస్ గురించి కాదు మిగతా హీరోయిన్స్ అంతా కూడా సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు.
తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న ఏ హీరోయిన్ అయినా సరే స్టార్ రేంజ్ కి వెళ్తుంది. అంతేకాదు మిగతా భాషల నుంచి ఆఫర్లు అందుకుంటుంది. తెలుగులో క్లిక్ అయ్యారు అంటే ఇక స్టార్ స్టేటస్ దక్కినట్టే. ప్రస్తుతం రష్మిక సౌత్ నార్త్ అనే తేడా లేకుండా దుమ్ముదులిపేస్తుంది. ఐతే ఆ నెక్స్ట్ ప్లేస్ లో ఎవరొస్తారన్నది ఆసక్తికరమైన చర్చగా నడుస్తుంది. ఈ పోటీలో సీనియర్ హీరోయిన్స్ ని పక్కన పెడితే యువ హీరోయిన్స్ లో ఆ ఛాన్స్ ఎవరికి ఉంది అన్నది లెక్క తేలాల్సి ఉంది.
మీనాక్షి చౌదరి ఒక్కతే వరుస ఛాన్సులు అందుకుంటూ సత్తా చాటుతుంది. ఐతే అమ్మడికి కూడా కాన్ స్టంట్ హిట్లు పడట్లేదు. ఒక సినిమా హిట్ పడితే మరో రెండు ఫ్లాపులు పడుతున్నాయి. మరోపక్క కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్, ప్రియాంక అరుల్ మోహన్, శ్రీలీల ఇలా అందరు సినిమాలు చేస్తున్నా ఆడియన్స్ మీద ఇంపాక్ట్ కలిగించడంలో ఫెయిల్ అవుతున్నారు. కొత్త భామ భాగ్య శ్రీ బోర్స్ కూడా తెలుగు పరిశ్రమలో తిష్ట వేయాలని చూస్తుంది. అమ్మడి ఖాతాలో క్రేజీ సినిమాలు పడుతున్నాయి.
సో వీళ్లంతా కూడా టాప్ 2 ప్లేస్ కోసమే పోటీ పడుతున్నారని చెప్పొచ్చు. రష్మికని తర్వాత వీళ్లలో ఎవరు టాప్ చెయిర్ ని అందుకుంటారు. ఎవరికి స్టార్ ఛాన్సులు వస్తాయన్నది చూడాలి. ఏది ఏమైనా సౌత్ లో కొత్త భామల సందడి ఆడియన్స్ కి కూడా మంచి జోష్ అందిస్తుంది. తెలుగులో పాన్ ఇండియా సినిమాలతో కూడా పాపులారిటీ తెచ్చుకుంటుండగా కథానాయికలు కూడా అలాంటి అవకాశాల కోసమే ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.