Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : టాప్ 5 కి ముగ్గురు ఓకే.. ఎవరా లక్కీ 2..?

ఆ నలుగురిలో ప్రస్తుతం టైటిల్ రేసులో దూసుకెళ్తున్న మరో ఇద్దరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:35 PM GMT
బిగ్ బాస్ 8 : టాప్ 5 కి ముగ్గురు ఓకే.. ఎవరా లక్కీ 2..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ తో ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ కొంతమేరకు క్లారిటీ వచ్చింది. ఈ సీజన్ టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ లో ఆల్రెడీ టికెట్ టు ఫినాలె గెలిచి అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. సో టాప్ 5 కి ఈ సీజన్ లో అవినాష్ ముందు వెళ్లాడు. ఇక మిగిలింది నలుగురు మాత్రమే. ఆ నలుగురిలో ప్రస్తుతం టైటిల్ రేసులో దూసుకెళ్తున్న మరో ఇద్దరు కూడా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పొచ్చు.

ఈ సీజన్ టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతం ఇద్దరు కూడా ఫైనల్ వీక్ దాకా ఉంటారని చెప్పొచ్చు. సో అలా చూస్తే అవినాష్ తో పాటు నిఖిల్, గౌతం ఈ ముగ్గురు టాప్ 5 లో కన్ఫర్మ్ అయినట్టే. అంటే ఐదుగురిలో ముగ్గురు కన్ ఫర్మ్ అయితే ఇంకా కావాల్సింది ఇద్దరు మాత్రమే. ఆ ఇద్దరు ఎవరు.. ఏ ఇద్దరికి ఆ లక్ వరిస్తుంది అన్నది చూడాలి. సీజన్ 8 లో శనివారం ఎపిసోడ్ తో టాప్ 5 లో దాదాపు క్లారిటీ వచ్చేసింది.

అవినాష్ టికెట్ టు ఫినాలె గెలవడంతో పాటు ఈ వీక్ సేవ్ అవ్వడంతో అతను మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన అవినాష్ ఓ పక్క ఎంటర్టైన్ చేస్తూనే టాస్కుల్లో కూడా సత్తా చాటాడు. హౌస్ లో అప్పటివరకు స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్స్ ని కూడా ఓడిస్తూ అవినాష్ టాస్కులు గెలుస్తూ వచ్చాడు. అందుకే అతను ఈ సీజన్ ఫైనలిస్ట్ అయ్యాడు.

బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ 5 లో ఛాన్స్ దక్కించుకునే ఆ లక్కీ 2 ఎవరన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుని. ఐతే ఈ సీజన్ ట్విస్టులు, టర్న్ లు అంటూ సడెన్ గా ఈ వారం డబల్ ఎలిమినేషన్ పెట్టాడు. ఆదివారం ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం టాప్ 5 లో ఆల్రెడీ అవినాష్ వెళ్లాడు కాబట్టి టాప్ 4 లో లెక్కలు మారే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 8 రాబోయే రెండు వారాల ఆటను బట్టే టాప్ 5లో కి వెళ్లే ఆ నలుగురు కంటెస్టెంట్స్ ని డిసైడ్ చేస్తారు. మరి అది ఎవరన్నది చూడాలంటే రెండు వారాలు వెయిట్ చేయాల్సిందే.