Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : హోటల్ టాస్క్ లో గెలిచింది ఎవరు..?

ఇక హౌస్ లో అందరు నీటిని వేస్ట్ చేయకూడదు అనే విషయం చెబుతూ హౌస్ లోకి కొంత సేపు వాటర్ సప్లై నిలిపివేశారు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 4:35 AM GMT
బిగ్ బాస్ 8 : హోటల్ టాస్క్ లో గెలిచింది ఎవరు..?
X

బిగ్ బాస్ సీజన్ 8 లో రెండు రోజులుగా నడుస్తున్న బీబీ హోటల్ టాస్క్ పూర్తైంది. గురువారం ఎపిసోడ్ లో రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ హోటల్ టాస్క్ ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. టాస్క్ మధ్యలో మెహబూబ్, హరితేజ, ప్రేరణ, గౌతం, నయని పావని పాత్రలను మార్చేశాడు బిగ్ బాస్. అలా కొద్దిసేపు టాస్క్ నడిపించాడు. ఇక హౌస్ లో అందరు నీటిని వేస్ట్ చేయకూడదు అనే విషయం చెబుతూ హౌస్ లోకి కొంత సేపు వాటర్ సప్లై నిలిపివేశారు. దాని కోసం రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ లకు ఒక కలర్ వాటర్ నింపే టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో ఓజీ క్లాన్ విన్ అయ్యింది.

ఒకపక్క ఉన్న వాటర్ ను మరోపక్క ఉన్న జార్ లో పోయాలి. ఐతే మధ్యలో కాలు కింద పెట్టకుండా ఏర్పాటు చేసిన వాటి మీద నడుస్తూ వెళ్లాలి. అలా ఓజీ క్లాన్ ఈ టాస్క్ లో గెలిచారు. ఇక హోటల్ టాస్క్ లో ఇప్పటివరకు యష్మికి గౌతం ఒక స్టార్ ఇవ్వగా రెండో స్టార్ కోసం రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ సభ్యులకు చిన్న చిన్న టాస్కులు పెట్టారు. ముందు అందరికీ కప్పగంతలు పెట్టగా అందులో యష్మి, ప్రేరణ ఆ తర్వాత నబీల్, పృధ్వి కూడా వెనకపడ్డారు.

నెక్స్ట్ మణికంఠ, విష్ణు ప్రియ, నిఖిల్, సీతలకు రెండు చేతుల్లో వాటర్ గ్లాస్ ఇచ్చి ఒక్క కాలి మీద నిలబడే టాస్క్ ఇచ్చారు. అందులో చివరి వరకు నిఖిల్, మణికంఠ ఉన్నారు. ఆ తర్వాత చివరగా స్విమ్మింగ్ పూల్ లో 11 స్పూన్స్ వేసి ఆ ఇద్దరిలో ఎవరు ముందు 6 తెస్తారో వారే విజేత అని చెప్పడంతో ఆ టాస్క్ లో నిఖిల్ విన్ అయ్యాడు. అలా నిఖిల్ ఒక స్టార్ గెలుచుకున్నాడు. ఐతే మణికంఠ ఎఫర్ట్స్ నచ్చడంతో పాటు హౌస్ టాస్క్ లో అతను ఇంప్రెస్ చేశాడని రోహిణి తన స్టార్ అతనికి ఇచ్చింది. ఐతే హోటల్ టాస్క్ ముగిసే సరికి రాయల్ క్లాన్ దగ్గర ఓజీ క్లాన్ కన్నా ఎక్కువ డబ్బు ఉండటంతో రాయల్ క్లాన్ సభ్యులే ఈ టాస్క్ గెలిచినట్టు బిగ్ బాస్ వెల్లడించాడు. రాయల్ క్లాన్ లో అందరు ఆకట్టుకోగా అవినాష్, రోహిణిలు ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నారు.

ఇక టాస్క్ స్టార్ట్ అవ్వడానికి ముందే సీత హరితేజ బ్యాగ్ నుంచి కొంత డబ్బు కొట్టేసింది. దాని గురించి ఆమె అడిగింది. మెగా చీఫ్ నబీల్ చెప్పడంతో చివరకు సీత ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చింది. ఫైనల్ గా నిన్నటితో హోటల్ టాస్క్ పూర్తి కాగా అందులో ఓజీ క్లాన్, రాయల్ క్లాన్ మెంబర్స్ అంతా తమ పాత్రలతో మెప్పించారు.