Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది..?

దసరా స్పెషల్ గా వచ్చిన ఎపిసోడ్ లో పూజా ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 Oct 2023 8:27 AM GMT
బిగ్ బాస్ 7 : టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఎవరికి ఉంది..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో ఏడు వారాల ఆట పూర్తైంది. 50 రోజుల ఆటలో ఇప్పటికే ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది తెలిసిపోయింది. ప్రతి వారం నామినేషన్స్ జరగడం అందులోంచి ఒకరు ఎలిమినేట్ అవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సీజన్ ఉల్టా పుల్టా కాబట్టి ఎలిమినేట్ అయిన రతిక హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మరోపక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అదిగురు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

ప్రస్తుతం హౌస్ లో 11 మంది హౌస్ మెట్స్ ఉన్నారు. దసరా స్పెషల్ గా వచ్చిన ఎపిసోడ్ లో పూజా ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. వీరిలో టాప్ 5 కి వెళ్లే ఛాన్స్ ఎవరికి ఉందన్నది చూస్తే. ఆటలతో పాటుగా ఆడియన్స్ మనసులు గెలిచే విషయంలో శివాజి ముందున్నారు. ఆయన చేయి నొప్పి వల్ల టాస్కులు ఆడట్లేదు కానీ ఆడితే మాత్రం ఆయన కచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతానికి హౌస్ లో ఉన్న 11 మందిలో ఏడుగురికి టాప్ 5 లో వెళ్లే ఛాన్స్ ఉంది. అందులో శివాజి, యావర్, సందీప్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంకా ఉన్నారు. ఈ ఏడుగురిలో ఎవరు టాప్ 5 కి వెళ్తారన్నది చూడాలి. అయితే వీరిలో ఎవరెవరు ఏయే స్థానాలు అన్నది ఆడియన్స్ ఓటింగ్ ని బట్టి తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 కాబట్టి టాప్ 5 కాదు టాప్ 7 అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ప్రస్తుతానికి ఉన్న 11 మంది హౌస్ మెట్స్ లో టాప్ 5 లో పైన చెప్పిన ఏడుగురికి ఛాన్స్ ఉంది. అయితే వీరిలో ఎవరైనా ఈ ఐదు వారాల్లో ఎలిమినేట్ అవుతారా.. వీళ్లు కాకుండా మిగిలిన వారిలో ఎవరైనా టాప్ 5 లో స్థానం సంపాధిస్తారా అన్నది చూడాలి. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ సీజన్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అందుకే ముందు జరిగిన ఆరు సీజన్లలో లేని రూల్స్ సీజన్ 7 ఉల్టా పుల్టా సీజన్ లో పెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఆడియన్స్ సీజన్ 7 ని సూపర్ హిట్ చేయగా క్రికెట్ వరల్డ్ కప్ వల్ల కాస్త ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు.