Begin typing your search above and press return to search.

బాలకృష్ణ సినిమా నిర్మాత ఎవరు..?

కె ఎస్ బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు వీర మాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.

By:  Tupaki Desk   |   26 July 2024 4:55 AM GMT
బాలకృష్ణ సినిమా నిర్మాత ఎవరు..?
X

ఈమధ్య కాలంలో బాలయ్య దూకుడు చూస్తుంటే యువ హీరోలు కూడా ఆయన ముందు తక్కువే అనేలా ఉన్నారు. సినిమా వెంట సినిమా చేస్తూ సత్తా చాటుతున్నారు. ఏపీ ఎలక్షన్స్ టైం లో ఒక 2, 3 నెలలు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న బాబీ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ లో మళ్లీ జాయిన్ అయ్యారు బాలకృష్ణ. కె ఎస్ బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకు వీర మాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.


ఇదిలా ఉంటే బోయపాటి శ్రీను తో బాలకృష్ణ మరో సినిమాకు రెడీ అవుతున్నారు. అఖండ సీక్వెల్ గా అఖండ 2 గా ఈ ప్రాజెక్ట్ రాబోతుందని తెలుస్తుంది. బోయపాటి బాలకృష్ణ చేస్తున్న అఖండ 2 సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఐతే ఈ సినిమాకు నిర్మాత విషయంలో క్లారిటీ రావట్లేదు. అదేంటి అంటే అఖండ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఏదైనా సినిమా సూపర్ హిట్ అయ్యి దానికి సీక్వెల్ తీస్తే అది ఆ బ్యానర్లోనే చేయాలి. ఐతే అఖండ 2 నిర్మాత మారుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

అఖండ 2 సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నారట మేకర్స్. మరి తమ బ్యానర్ లో హిట్ అయిన సినిమాను వేరే బ్యానర్ లో తీస్తే ఊరుకుంటాడా. ఇదే కాదు గీతా ఆర్ట్స్ తో బోయపాటి శ్రీను కూడా ఉంది. మరి ఆ సినిమా ఎవరితో చేస్తాడన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి బాలకృష్ణ సినిమా మొదలవుతున్న ఈ టైం లో నిర్మాతల మీద ఈ సస్పెన్స్ ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తుంది.

ఇక బాబీతో బాలయ్య చేస్తున్న సినిమా గురించి చెప్పుకుంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కె ఎస్ బాబీ డైరెక్షన్ స్టైల్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. సినిమా లో కొన్ని యాక్షన్ సీన్స్ నందమూరి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. మరి ఈ వీర మాస్ ది బెస్ట్ అనిపించుకుంటాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.