సౌత్ రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా?
చాలామంది మన టాలీవుడ్ కి వచ్చేసరికి ఎక్కువ ఆస్తులు చిరంజీవికి ఉన్నాయి కాబట్టి ఆయనే ఫస్ట్ ఆప్షన్ గా చెబుతారు.
By: Tupaki Desk | 22 Nov 2023 6:29 AM GMTసౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతుడైన హీరో ఎవరు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం కాస్త కష్టమే. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలో అంటే ఎన్నెన్నో లెక్కలు వేసుకోవాలి. చాలామంది మన టాలీవుడ్ కి వచ్చేసరికి ఎక్కువ ఆస్తులు చిరంజీవికి ఉన్నాయి కాబట్టి ఆయనే ఫస్ట్ ఆప్షన్ గా చెబుతారు. అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ లేక కమలహాసన్ అని అంటుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, సౌత్ ఇండస్ట్రీలో చిరంజీవి, రజనీకాంత్, కమలహాసన్ కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న హీరో మరొకరు ఉన్నారు.
ఇప్పుడు సౌత్ లో అత్యధిక ధనవంతుడైన హీరో కూడా ఆయనే. ఇంతకీ ఆయన మరెవరో కాదు మన టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున. ఇదే విషయాన్ని ప్రముఖ GQ రిపోర్ట్ ఓ సర్వేలో తెలిపింది. సౌత్ లో ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, రజనీకాంత్, కమల్ హాసన్ ఈమధ్య మంచి సక్సెస్ అందుకున్నారు. కోలీవుడ్లో గత ఏడాది విక్రమ్ సినిమాతో కమల్ ఇండస్ట్రీ హిట్ అందుకోగా, రజనీకాంత్ జైలర్ తో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు.
ఇక వాల్తేరు వీరయ్య తో చిరంజీవి, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బాలయ్య వరుస హిట్స్ అందుకున్నాడు. కానీ నాగార్జున మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే GQ రిపోర్ట్ ప్రకారం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఆస్తి ఉన్న హీరోగా అక్కినేని నాగార్జున నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. నాగార్జునకి దాదాపు 3 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
హీరో గానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా, పారిశ్రామికవేత్తగా కోట్ల రూపాయల సంపాదిస్తున్నాడు నాగార్జున.
తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. ఒక్కో సినిమాకి 9 నుంచి 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. దాంతో తన ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలను నిర్మించడం ద్వారా మరింత ఆదాయాన్ని రాబడుతున్నారు.అంతేకాకుండా కేరళ బ్లాస్టర్స్ FC సహ యజమాని నాగార్జున తన సంపాదన ఇండియన్ సూపర్ లీగ్ మరియు రియల్ ఎస్టేట్ పెట్టుబడి లో పెట్టారు.
హైదరాబాద్ లో గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. ప్రస్తుతం పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా ఉన్నారు. ఇక నాగార్జున ఆస్తుల్లో హైదరాబాదులో రూ.45 కోట్ల విలువైన బంగ్లా, కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ఉన్నాయి. నాగార్జున తర్వాతి స్థానంలో దగ్గుబాటి వెంకటేష్, చిరంజీవి సౌత్ ఇండియాలోనే రిచెస్ట్ హీరోలుగా కొనసాగుతున్నారు. వెంకటేష్ ఆస్తుల విలువ రూ.2,600 కోట్లు కాగా చిరంజీవికి రూ.1650 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.