రాజమౌళి రికార్డులు కొట్టేదెవరు?
ఇప్పుడా రికార్డును టాలీవుడ్ నుంచి ఏ దర్శకుడు తిరగరాస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 17 April 2024 6:52 AM GMTఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు వెలిగిపోతుంది. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలతో తర్వాత ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే ఇప్పుడా పేరు ఓ సంచలనం. 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' చిత్రాలు 3000 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడా రికార్డును టాలీవుడ్ నుంచి ఏ దర్శకుడు తిరగరాస్తాడు? అన్నది ఆసక్తికరంగా మారింది. రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు.
తారక్ తో కొరటాల శివ 'దేవర' రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలు వేర్వేరుగా విడుదలవుతున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత టైగర్ నుంచి రాబోతున్న సినిమా నేపథ్యంలో భారీ వసూళ్లు సాధిస్తుందనే అంచనాలున్నాయి. అది హిట్ అయితే రెండవ భాగంపై అంచనాలు ఇంకా బలపడతాయి. ఆ రెండు భాగాలు కలిపి ఎంత వసూళ్లు చేస్తాయన్నది ఇప్పుడే చెప్పలేని మాట. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' రెడీ అవుతోంది.
శంకర్ బాక్సాఫీస్ ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా హిట్ అయిందంటే ప్రపంచాన్నే దున్నేస్తాయి. ఒక్క సినిమాతో రాజమౌళి చరిత్ర బీటలు వారుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. దీంతో పాటు ఆర్సీ 16..17 సినిమాలు కూడా వేర్వేరు దర్శకులతో పాన్ ఇండియాలో లాక్ చేసి పెట్టాడు చరణ్. ఇక 'సలార్' మొదటి భాగంతోనే 700 కోట్లకు పైగా కొల్లగొట్టారు ప్రభాస్-ప్రశాంత్ నీల్.. రెండవ భాగం అంతకు మించి అంచనాలతో రిలీజ్ అవుతుంది.
ఇది 1500 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందనే అంచనాలున్నాయి. దీంతో పాటు సందీప్ వంగా... హనురాఘవపూడి లాంటి స్టార్ డైరెక్టర్లను డార్లింగ్ లైన్ లో పెట్టి ఉంచాడు. వీళ్లిద్దర్నీ ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. రెండవ సినిమాతోనే సందీప్ రెడ్డి 1000 కోట్లకు అతి చేరువకు వచ్చేసాడు. ప్రభాస్ లాంటి కటౌట్ అతడికి తోడ యిందంటే? బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడానికి అవకాశం ఉంటుందన్నది గుర్తు పెట్టు కోవాల్సిందే.
ఇక 'పుష్ప'తో పాన్ ఇండియా సంచలనమైన మరో కాంబినేషన్ బన్నీ-సుకుమార్ రెండవ భాగంతో రెడీ అవు తున్నారు. నార్త్ మార్కెట్ లో అనూహ్య వసూళ్లు 'పుష్ప' రేంజ్ ని మార్చేసాయి. రెండవ భాగం భారీగా వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.