Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఈ వారం హౌస్ కి గుడ్ బై చెప్పేది ఎవరంటే..?

రీ ఎంట్రీ తర్వాత అయినా ఆట ఆడుతుందేమో అనుకుంటే బయట ఆట చూసి వచ్చిన తర్వాత ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండాలని ప్రయత్నించింది.

By:  Tupaki Desk   |   11 Nov 2023 7:34 AM GMT
బిగ్ బాస్ 7 : ఈ వారం హౌస్ కి గుడ్ బై చెప్పేది ఎవరంటే..?
X

బిగ్ బాస్ సీజన్ 7 లో 10వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైనట్టు తెలుస్తుంది. ఆదివారం జరిగే ఎలిమినేషన్ కి సంబంధించిన షూటింగ్ శుక్ర, శని వారాల్లో చేస్తారు. అయితే రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది ఈరోజు తెలిసిపోతుంది. అయితే ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చెప్పొచ్చు. ఈ వారం నామినేషన్స్ లో శివాజి, యావర్, రతిక, బోలే శావలి, గౌతం లు ఉన్నారు. వారిలో ఎవరు బయటకు వెళ్లాలన్నది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు.

ఓటింగ్ రిజల్ట్ ని బట్టి చూస్తే ఈ వారం ఇద్దరు హౌస్ మెట్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రతిక, బోలే శావలి ఇద్దరిలో ఒకరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారు. మాక్సిమం రతిక ఇంటికి గుడ్ బై చెప్పేస్తుందని అంటున్నారు. ఆల్రెడీ రతిక ఒకసారి ఎలిమినేట్ అయ్యి హౌస్ లోకి వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత అయినా ఆట ఆడుతుందేమో అనుకుంటే బయట ఆట చూసి వచ్చిన తర్వాత ప్రశాంత్ తో క్లోజ్ గా ఉండాలని ప్రయత్నించింది. శివాజికి కూడా దగ్గరగా ఉండే ప్రయత్నం చేసింది. యావర్ కి కూడా బయట స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతనితో కల్సి ఉంది.

రీ ఎంట్రీ తర్వాత కూడా రతిక తన ఆట తీరుని మెరుగుపరచుకోలేదు. అందుకే ఆమెని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓ పక్క బోలే శావలి తన పాటలతో కొద్దో గొప్పో కంటెంట్ ఇస్తున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 లో రెండో ఛాన్స్ వచ్చినా కూడా వాడుకోలేకపోయింది. ఇక ఈ వారం నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ జరుగనుంది.

మిగిలిన ఐదు వారాల్లో ఎవరు బయటకు వస్తారు ఎవరు టాప్ 5లో ఉంటాననది తెలుస్తుంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న కొందరికి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. టైటిల్ విన్నర్ రేసులో ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా సీజన్ 7 టైటిల్ విజేత ఎవరు అవుతారన్నది చూడాలి. సీజన్ 6 ఫ్లాప్ అవడంతో సీజన్ 7 ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో నడిపిస్తున్నారు బిగ్ బాస్ టీం. హోస్ట్ నాగార్జున కూడా ఈ సీజన్ లో అదరగొట్టేశారు. అన్ని విధాలుగా ఈ సీజన్ ది బెస్ట్ అనిపించుకుంటుంది. అయితే రాబోయే నాలుగైదు వారాలు కూడా ఇదే కొనసాగిస్తే బెటర్ అని చెప్పొచ్చు.