Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ తమిళ్‌: క‌మ‌ల్ స్థానంలో ఈ హీరోకే ఛాన్స్

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8కి హోస్ట్ గా పాపుల‌ర్ తమిళ స్టార్ విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉన్నార‌ని ప్ర‌చారం సాగిస్తోంది.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:27 PM GMT
బిగ్ బాస్ తమిళ్‌: క‌మ‌ల్ స్థానంలో ఈ హీరోకే ఛాన్స్
X

తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంటున్నారు. చాలా సీజ‌న్లకు ఆయ‌న హోస్ట్. ఈసారి కూడా సీజ‌న్ 8కి ఆయ‌నే. అయితే త‌మిళంలో ఈసారి సీజ‌న్ 8 హోస్ట్ మారుతున్న‌ట్టు క‌థ‌నాలొస్తున్నాయి. రియాలిటీ షో బిగ్ బాస్ నుండి లెజెండరీ నటుడు-ద‌ర్శ‌క‌నిర్మాత కమల్ హాసన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో కమల్ స్థానంలో హోస్ట్‌గా అడుగుపెట్టబోయే సెలబ్రిటీ ఎవ‌రు అన్న‌దానిపై అందరిలో ఉత్కంఠ నెల‌కొంది. ఇప్పటి వరకు నయనతార, శింబు వంటి ప్రముఖ కోలీవుడ్ తారలు హోస్ట్ అవతార్ లో క‌నిపిస్తార‌ని వారి పేర్లు పరిశీలనలో ఉన్నాయ‌ని పుకార్లు వచ్చాయి.


అయితే మీడియా ఇప్పుడు కొత్త పేరును తెర‌పైకి తెచ్చింది. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8కి హోస్ట్ గా పాపుల‌ర్ తమిళ స్టార్ విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉన్నార‌ని ప్ర‌చారం సాగిస్తోంది. బిగ్ బాస్ తమిళ్‌ నిర్వాహకులు ప్ర‌స్తుతం విజయ్ సేతుపతితో చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. ఈ చర్చ‌లు ఇంకా ఆరంభ దశలో ఉన్నాయని తెలిసింది. అయితే హోస్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ప్రముఖ నటులు రియాజ్ ఖాన్, పూనమ్ బజ్వా, నటుడు కం స్టాండ్-అప్ కమెడియన్ కార్తీక్ కుమార్, ప్రముఖ నటుడు విజయ్ కుమార్, టీవీ స్టార్ బబ్లూ పృథ్వీరాజ్, నటి శ్వేతా మీనన్, నేపథ్య గాయని కల్పన, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమలా షాజీ, హోస్ట్ మకపా ఆనంద్, హాస్యనటుడు రోబో శంకర్, నటి సోనియా అగర్వాల్, నటుడు కిరణ్ బిగ్ బాస్ హౌస్‌ను అలరించే ఇంటి స‌భ్యులు అని తెలుస్తోంది.