Begin typing your search above and press return to search.

జాన్వి నాట్ ఇంట్రెస్టెడ్.. ఏం జరిగింది..?

దేవర సినిమాలో తంగం పాత్ర చేసిన జాన్వి కపూర్ సినిమాలో గ్లామర్ గా మెప్పించినా కూడా ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:19 AM GMT
జాన్వి నాట్ ఇంట్రెస్టెడ్.. ఏం జరిగింది..?
X

శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ తన మదర్ లానే కథానాయికగా రాణించాలని చూస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా పాగా వేయాలని ప్లాన్ చేసింది. టాలీవుడ్ లో దేవరతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన అమ్మడు ఆ సినిమా వల్ల పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. దేవర సినిమాలో తంగం పాత్ర చేసిన జాన్వి కపూర్ సినిమాలో గ్లామర్ గా మెప్పించినా కూడా ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదని చెప్పొచ్చు.

మరోపక్క దేవర 2 లో అయినా జాన్వి పాత్రకు వెయిట్ ఉంటుందా లేదా అన్న డౌట్లు మొదలయ్యాయి. ఐతే దేవర తర్వాత జాన్వి కపూర్ రాం చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకుంది. బుచ్చి బాబు సన డైరెక్షన్ లో రాం చరణ్ చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా వస్తుంది. సినిమాలో జాన్వికి మంచి పాత్ర దొరికినట్టు తెలుస్తుంది. ఉప్పెన సినిమాలో బేబమ్మ పాత్ర మెయిన్ లీడ్ కాగా ఆర్సీ 16లో జాన్వి కేవలం గ్లామర్ పరంగానే కాదు స్కోప్ ఉన్న రోల్ చేస్తుందని తెలుస్తుంది.

ఐతే ఈమధ్య జాన్వి కపూర్ కి తెలుగు సినిమా నుంచి మరో రెండు ఆఫర్లు వచ్చాయట. ఐతే అవి కూడా కేవలం సినిమాలో పాటల వరకు అన్నట్టుగానే అనిపించాయట. అందుకే ఆ సినిమాలను జాన్వి కపూర్ రిజెక్ట్ చేసింది. ప్రాముఖ్యత లేని పాత్ర చేయడం వల్ల కెరీర్ కు ఏమాత్రం ఉపయోగపడకపోగా గ్రాఫ్ పడిపోయేలా చేస్తాయని తెలుస్తుంది. అందుకే జాన్వి కపూర్ రీసెంట్ గా తెలుగు నుంచి వచ్చిన ఒకటి రెండు ఆఫర్లు కాదనేసిందట.

ఇక జాన్వి కపూర్ హిందీ ఆఫర్లు కూడా ఆశించిన స్థాయిలో లేవు. అక్కడ గ్లామర్ పరంగా డోస్ పెంచి సినిమాలు చేస్తున్నా కూడా జాన్వి కపూర్ కి పెద్దగా వర్క్ అవుట్ అవ్వట్లేదు. కెరీర్ లో ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తుంది జాన్వి కపూర్. మరి అది సౌత్ సినిమా అవుతుందా లేదా బాలీవుడ్ ప్రాజెక్ట్ తోనే అమ్మడు తిరిగి ఫాంలోకి వస్తుందా అన్నది చూడాలి. ఐతే కెరీర్ మీద పట్టు సాధించే క్రమంలో ఇలా అప్ అండ్ డౌన్స్ కామనే కాబట్టి జాన్వి కపూర్ కూడా డీలా పడిపోకుండా వెయిట్ చేస్తుందని చెప్పుకుంటున్నారు.