Begin typing your search above and press return to search.

మృణాల్‌ భలే లక్కీ.. ఎందుకో తెలుసా!

సీతారామం సినిమా హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:30 PM GMT
మృణాల్‌ భలే లక్కీ.. ఎందుకో తెలుసా!
X

హిందీ బుల్లితెర, వెండితెర పై సుదీర్ఘ కాలంగా కనిపిస్తూ వస్తున్న మృణాల్ ఠాకూర్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. కానీ అనూహ్యంగా తెలుగు లో నటించిన మొదటి సినిమా సీతారామంతో స్టార్‌డమ్‌ దక్కింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. సీతారామం సినిమా హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు దక్కించుకుంది. నానికి జోడీగా ఈ అమ్మడు నటించిన హాయ్ నాన్న సినిమా సైతం మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు గతంలో కోలీవుడ్‌ లో ఒక బిగ్‌ ఛాన్స్ మిస్‌ చేసుకుంది. కానీ ఆ ఛాన్స్ మరోసారి ఆమె తలుపు తట్టింది.

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన కంగువా సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. కానీ ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల కంగువా నుంచి మృణాల్‌ ను తప్పించి దిశా పటానీ ని నటింపజేయడం జరిగింది. సూర్య వంటి స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారడంతో కోలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆఫర్లు దక్కడం కష్టమే అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అదే కోలీవుడ్‌లో, అదే స్టార్‌ హీరో సూర్యకు జోడీగా ఒక సినిమాలో నటించే అవకాశం దక్కింది. కంగువా సినిమా తర్వాత సూర్య నటించబోతున్న సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించబోతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్‌గా సూర్యకు జోడీగా ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ను ఎంపిక చేయడం జరిగిందట.

మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా సూర్యకు జోడీగా నటించడం దాదాపు కన్ఫర్మ్‌ అయిందని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక వైపు బాలీవుడ్‌ మరో వైపు టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ మరో వైపు కోలీవుడ్‌లోనూ స్టార్‌ హీరోలకు జోడీగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ ఈ అమ్మడు దూసుకు పోతుంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ లో కాస్త స్లో అయినట్లు అనిపించినా ముందు ముందు మళ్లీ టాలీవుడ్‌ లో ఈ అమ్మడు పుంజుకోవడం ఖాయం అనే అభిప్రాయంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో ఈమె నటించిన ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరచింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం వల్లే తెలుగు లో ఆఫర్ల విషయంలో ఈ అమ్మడు కాస్త ఆలోచనలో పడింది. వచ్చిన ప్రతి సినిమాను కమిట్‌ అవ్వకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశ్యంతో ఇటీవల ఒకటి రెండు సినిమాలకు నో చెప్పిందని, తమిళ్‌ లో సూర్య వంటి స్టార్‌ హీరో సినిమా ఛాన్స్ రావడంతో తెలుగు సినిమా విషయంలో మరింత ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి మృణాల్ ఠాకూర్‌ సినిమా అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఆఫర్లు దక్కించుకుంటూ భలే లక్కీ అనిపించుకుంటోంది.