టబుని ఎవ్వరూ పిలవడం లేదా? రావడం లేదా?
కంబ్యాక్ మూవీ మంచి విజయాన్ని అందించింది. సినిమాలో కీలక పాత్రలో నటించి మరోసారి ప్రశంలందుకుంది.
By: Tupaki Desk | 23 Feb 2025 12:30 AM GMTవెటరన్ నటి టబు దాదాపు 17 ఏళ్ల తర్వాత 'అలవైకుంఠపురములో'తో టాలీవుడ్ లో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. కంబ్యాక్ మూవీ మంచి విజయాన్ని అందించింది. సినిమాలో కీలక పాత్రలో నటించి మరోసారి ప్రశంలందుకుంది. ఈ సినిమా తర్వాత టబు మళ్లీ యధావిధిగా తెలుగు సినిమాల్లో కంటున్యూ అవుతారాని అంతా అనుకున్నారు? కానీ ఆమె `అలవైకుంఠపురం` తర్వాత ఇంతవరకూ మరో తెలుగు సినిమా చేయలేదు.
హిందీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. అక్కడే నటిగా కొనసాగుతుంది. `అలవైకుంఠపురములో` రిలీజ్ అయి నాలుగేళ్లు అయింది. మరి టబు తెలుగు సినిమాలు ఎందుకు చేయనట్లు? అవకాశాలు రాక చేయలేదా? వచ్చినా వద్దనుకుంటున్నారా? అన్నది తెలియాల్సిన విషయం. బాలీవుడ్ లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా బోల్డ్ పాత్రలు కూడా పోషిస్తుంది.
స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో పాటు బోల్డ్ అటెంప్ట్ లు విడిచి పెట్టకుండా చేస్తుంది. ఆరకంగా టబు కొన్ని విమర్శలు కూడా ఎదుర్కుంది. 53 ఏళ్ల వయసులోనే బోల్డ్ పాత్రలు అవసరమా? అని విమర్శలు సైతం ఎదుర్కుంది. కానీ వాటిని పట్టించుకోకుండా అమ్మడు ముందుకు సాగుతుంది. గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో ఓ సినిమా క్రూ మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం `భూత్ బంగ్లా` అనే హిందీ సినిమాలో నటిస్తోంది. కమిట్ అయిన చిత్రాల్లో ఇదొక్కటే కని పిస్తుంది. కొత్త సినిమాలేవి లైనప్ లో లేవు. మరి ఈ ఏడాదైనా తెలుగు సినిమాలేవైనా చేస్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ వచ్చిన తెలుగు అవకాశాలు తిరస్కరించిందా? అన్నది కూడా తెలియాలి.