బీఎస్సీ డిగ్రీ నాకెందుకు పనికిరాలేదు!
నేటి జనరేషన్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు.
By: Tupaki Desk | 1 Jan 2024 3:15 AM GMTబాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అంచలం చెలుగా ఎదిగిన నటుడాయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకొచ్చి సక్సెస్ అయిన నటుడు. నాలుగు దశాబ్ధాలుగా ప్రేక్షకుల్ని తనదైన మార్క్ చిత్రాలతో అలరిస్తున్నారు. హిందీ సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో మెప్పిస్తున్నారు. నేటి జనరేషన్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఇక ఆయన సోలోగా చేయాల్సిన ప్రయత్నాలు ఓవైపు జరుగుతూనే ఉన్నాయి.
నటుడిగా ఆయన తెరపై ఇక కొత్తగా చేయాల్సిదంటూ ఏమీ లేదు. ఆయన ఏం చేసినా అదే కొత్తదనం తీసుకొస్తుంది. ఆ స్థాయిలో పేరు సంపాదించిన ఏకైక నటుడాయన. ఇక టీవీషోలతోనూ బిగ్ బీ అభిమా నుల్ని అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన హోస్ట్ చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతీ ఎంత సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ ఆ షో రన్నింగ్ లో ఉంది. ఆయనే హోస్ట్ చేస్తున్నారు. ఎంతో మంది కోటీశ్వరుల్ని తయారు చేస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బీ అమితాబ్ తన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
ఢిల్లీలో తాను చదివిన కిరోరీ మల్ కాలేజీలోనే షో కంటెస్టెంట్ కూడా చదవడంతో బిగ్ బీ నాటి జ్ఞాపకాల్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. `అప్పట్లో నేను హాస్టల్‌లో ఉండి చదువుకునే వాణ్ణి. అది ఓ మూలన ఉండేది. గదిలోంచి చూస్తే ప్రహరీ గోడ కనిపించేది. సినిమాలు చూసేందుకు మేము గోడ దూకి వెళ్లేవాళ్లం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలం టే..కాలేజీలో నేను చదివిన రోజులన్నీ నిరుపయోగమైనట్టే.
అప్పట్లో నేనేమీ సాధించింది లేదు. నా బీఎస్సీ డిగ్రీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు` అని అన్నారు. అలహబాద్‌లోని బాయ్ హైస్కూల్లో ఆయన స్కూలింగ్ పూర్తి చేసారు . తర్వాత 1962లో డిగ్రీ పూర్తి చేసారు. ఆ తర్వాత బాలీవుడ్ లో సినిమా ప్రయత్నాలు..రకరకాల అనుభవాలు అన్నింటిని చూసారు.