స్పందన మృతికి వ్యాయామం కారణమా!?
కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో బ్యాంకాక్‌లో సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Aug 2023 2:11 PM GMTకన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో బ్యాంకాక్‌లో సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. విహార యాత్రకు వెళ్లిన స్పందన జీవితం విషాదంతో ముగిసింది. నిద్రలో ఉండగా ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు బ్యాంకాక్ వైద్యులు నిర్ధారించారు. అయితే మృతికి కారణాలు నెట్టింట రకరకాలు గా వైరల్ అవుతున్నాయి. కీటో డైట్ -విపరీతమైన వ్యాయామం అనే అంశాన్ని ముడిపెట్టి స్పందన మృతిని విశ్లేషించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొంత కాలంగా స్పందన కీడో డైట్ ని అనుసరించడం.. విపరీతమైన వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడం పట్ల విపరీతమైన ఒత్తిడికి గుండెపోటుకు కారణమై ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మృతి చెందడానికి కారణంగా తీవ్రమైన వ్యాయామలే అనే సందేహాలు తెరైకి వచ్చి సంగతి తెలిసిందే.
ఇటీవలే స్పందన కూడా 16 కిలోలు బరువు తగ్గినప్పుడు సోషల్ మీడియాలో ఆమె అంకిత భావాన్ని అంతా ప్రశంసించారు. ఇంతలోనే వ్యాయామం కారణంగా ఒత్తిడికి గురై గుండె పోటు వచ్చిందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. ఇక స్పందన భౌతిక కాయం ఈరోజు రాత్రి 11 గంటలకు థాయ్ లాండ్ నుంచి బెంగుళూరుకి చేరుకుంటుందని స్పందన మామ హరి ప్రసాద్ తెలిపారు.
అక్కడ నుంచి భౌతిక కాయన్ని 12.30 గంటలకు ఇంటికి చేర్చుతారు. స్పందన తండ్రి బికె నివాసంలో అంతిమ నివాళులు అర్పించడానికి భౌతిక కాయాన్ని ఉంచుతారు. బుధవారం మధ్యాహ్నం శ్రీరాంపురలోని హరిశ్చంద్ర ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు.