తాప్సీ తర్వాత పూజా ఎందుకిలా?
అయితే తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ సాధించాక టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిని విమర్శించడంతో ఇక ఇక్కడ అవకాశాల తలుపులు పర్మినెంట్ గా మూసుకుపోయాయి.
By: Tupaki Desk | 30 Dec 2023 12:14 PM GMT`ఝుమ్మందినాదం` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తాప్సీ పన్ను ఆ తర్వాత ఇక్కడ ఆశించిన కెరీర్ దక్కక తమిళంలోకి వెళ్లిపోయింది. అయితే అక్కడా స్టార్ డమ్ ఆశించిన స్థాయికి చేరుకోలేదు. దీంతో హిందీ చిత్రసీమలో తన మూలాల్ని వెతుక్కుంది. దిల్లీకి చెందిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో బలమైన ముద్ర వేసేందుకు లేడీ ఓరియెంటెడ్ కథాంశాల్ని ఎంపిక చేసుకుంది. కొన్ని గట్స్ ఉన్న పాత్రల్లో నటించి తాప్సీ ల్యాండ్ మార్క్ గా మారింది. అటుపై గ్లామరస్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తాప్సీ తన ఉనికిని చాటుకుంటోంది.
అయితే తాప్సీ బాలీవుడ్ లో సక్సెస్ సాధించాక టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిని విమర్శించడంతో ఇక ఇక్కడ అవకాశాల తలుపులు పర్మినెంట్ గా మూసుకుపోయాయి. తాప్సీ తరహాలోనే అగ్ర నాయిక హోదాకు చేరుకున్నాక పూజా హెగ్డే పైనా చాలా విమర్శలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఇద్దరి కెరీర్ జర్నీ పూర్తిగా వేరు. పూజా హెగ్డే ఒక తమిళ ఫ్లాప్ సినిమాతో కెరీర్ ప్రారంభించి అటుపై టాలీవుడ్ లో ముకుంద లాంటి హిట్ చిత్రంతో రంగ ప్రవేశం చేసింది. అటుపై అగ్ర హీరోలందరి సరసనా అవకాశాలందుకుంది. టాలీవుడ్ లో భారీ బ్లాక్ బస్టర్లలో ఆల్మోస్ట్ అందరు హీరోల సరసనా నటించింది. ఇక్కడ మంచి డిమాండ్ ఉన్న స్టార్ గా ఓ వెలుగు వెలిగిపోయింది. అల వైకుంఠపురములో చిత్రంతో బాపు బొమ్మగాను ప్రజల హృదయాల్ని గెలుచుకుంది.
అయితే అనూహ్యంగా పూజా కెరీర్ లో వరుస ఫ్లాపులు ఐరెన్ లెగ్ ముద్రను వేసాయి రాధే శ్యామ్-ఆచార్య-కెకెబిజె వంటి ఫ్లాప్ చిత్రాలతో పూజా ప్రజాదరణ కోల్పోయింది. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్, త్రివిక్రమ్ - మహేష్ ల గుంటూరు కారం ఆఫర్లను కోల్పోవడంతో పూజా కి ఏమైంది? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ సహా సిబ్బంధికి హై క్లాస్ సౌకర్యాలు కావాలని కోరుతోందని దాని వల్ల మేకర్స్ తనవైపు మొగ్గు చూపడం లేదని కూడా ప్రచారం సాగిపోయింది. ఇటీవల హరీష్ మరో కొత్త ఆఫర్ ఇవ్వాలని అనుకున్నాడు. రవితేజతో మిస్టర్ బచ్చన్ లో పూజాకు అవకాశం ఇచ్చినా కానీ సుమారు 3 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో మేకర్స్ తనను కాదనుకుని ఒక కొత్త కథానాయికు అవకాశం ఇచ్చారు.
సహజంగానే రవితేజ ఇటీవల కొత్త కథానాయికలకు అవకాశాలు కల్పిస్తున్నాడు. తక్కువ పారితోషికంతో కొత్త భామలతో పనవుతుందని నిర్మాతలకు సూచిస్తున్నాడని ప్రచారం ఉంది. అనంతరం పూజా స్థానంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంపికైంది. అయితే పూజా కావాలనే పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్టును లైట్ తీస్కుందా? అన్న చర్చా ఇప్పుడు మొదలైంది. తాప్సీ లాంటి కథానాయికతో పోలిక లేకపోయినా కానీ, పూజా కూడా అవకాశాలను కావాలనే కోల్పోతోందని గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఓ వెబ్ సిరీస్ సహా షాహిద్ సరసన ఓ చిత్రంలోను నటిస్తోంది. కారణం ఏదైనా దక్షిణాదిన తనకు గడ్డుకాలం ఎదురైందన్నది సుస్పష్టం.