అంబానీల పెళ్లికి ప్రభాస్ రాలేదేమీ?
టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క స్టార్ రామ్ చరణ్ మాత్రమే అంబానీల ప్రీవెడ్డింగ్ కి హాజరయ్యారు. ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఈ వేడుకలకు హాజరవుతారనుకుంటే అక్కడ కనిపించలేదు.
By: Tupaki Desk | 5 March 2024 4:38 PM GMTమూడు రోజుల పాటు జామ్ నగర్ అతిథులతో జామ్ అయిపోయింది. ఎట్టకేలకు నేటితో ఇది క్లియర్ అవుతోంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సహా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రముఖుల్లో మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, ఇవాంక ట్రంప్ కూడా హాజరయ్యారు. అయితే ఇలాంటి కీలకమైన ఈవెంట్ కి కొందరు ప్రముఖులు హాజరు కాకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, కాజోల్, డియోల్ కుటుంబ సభ్యులు హాజరుకాలేదు.
జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో తారలంతా ఎంతో గ్లామరస్‌గా కనిపించారు. ఈ మూడు రోజుల వ్యవహారంలో సెలబ్రిటీలు అద్భుత అలంకరణలతో మెరుపులు మెరిపించారు. పాప్ స్టార్ రిహన్న, ఎకాన్, అరిజిత్ సింగ్, దిల్జిత్ దోసాంజ్, శ్రేయా ఘోషల్‌ల పాటలకు దూరంగా డ్యాన్స్ చేశారు. కొందరు దిగ్గజ తారలే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది.
ఆరోగ్య సమస్య కారణంగా హృతిక్ రోషన్ ఈ ప్రీవెడ్డింగ్ వేడుకకు హాజరు కాలేదు. ఫంక్షన్‌లకు కొన్ని రోజుల ముందు హృతిక్ క్రచెస్‌లో ఉన్న ఫోటోని షేర్ చేసాడు. కండరాలు లాగినట్లు నొప్పిని భరిస్తున్నానని వెల్లడించారు. గత ఏడాది అనంత్, రాధికల నిశ్చితార్థ వేడుకకు హాజరైన కరణ్ జోహార్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో కనిపించలేదు. NMACC ఓపెనింగ్ కోసం నిక్ జోనాస్‌తో కలిసి వెళ్లిన ప్రియాంక చోప్రా ఈసారి జామ్‌నగర్‌లో ఫంక్షన్‌లకు దూరమైంది. అయితే ఈ కార్యక్రమానికి ఆమె తల్లి మధు చోప్రా హాజరయ్యారు.
గత నెలలో తమ రెండవ బిడ్డను స్వాగతించిన అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. అనంత్ -రాధికల హస్తక్షర్ వేడుకలో పాల్గొనలేకపోయారు. కాజోల్ కూడా వేడుక నుండి మిస్సయారు. కానీ ఆమె గైర్హాజరీని అజయ్ దేవగన్- నైసా దేవగన్ భర్తీ చేసారు. డియోల్ కుటుంబ సభ్యులెవరూ ఈ వేడుకకు హాజరు కాలేదు. శిల్పాశెట్టి కుటుంబ సభ్యులు వేడుకల్లో కనిపించలేదు.
టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క స్టార్ రామ్ చరణ్ మాత్రమే అంబానీల ప్రీవెడ్డింగ్ కి హాజరయ్యారు. ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ ఈ వేడుకలకు హాజరవుతారనుకుంటే అక్కడ కనిపించలేదు. తెలుగు సినీపరిశ్రమ నుంచి చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందిందా? లేకుంటే ఆహ్వానాలు అందుకుని కూడా ఇతరులు రాలేకపోయారా? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే హాజరైన వారికి గుర్తుండిపోయే మంచి విషయాలున్నాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ మరపురాని ప్రదర్శన కోసం వేదికపైకి వచ్చారు. అంబానీ కుటుంబ సభ్యులు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఈ కోలాహలానికి అదనపు ఆకర్షణనిచ్చాయి. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం దాండియా ఆడటం కూడా ఆసక్తిని కలిగించింది.