Begin typing your search above and press return to search.

వీడియో: అందుకేనా శ‌ర్మా గాళ్ ఇలా రెచ్చిపోతోంది

నేహాశర్మ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వృత్తిపరంగా నిరాశ‌ప‌డిన ఓ అనుభవాన్ని వివ‌రించింది.

By:  Tupaki Desk   |   1 Dec 2023 11:10 AM GMT
వీడియో: అందుకేనా శ‌ర్మా గాళ్ ఇలా రెచ్చిపోతోంది
X

శర్మా గాళ్స్ నిరంత‌ర ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో హాట్ టాపిక్‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఇరువురు సిస్ట‌ర్స్ లో నేహా శర్మ బాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించింది. తుమ్ బిన్ 2, యంగిస్తాన్ , క్యా సూపర్ కూల్ హై హమ్ వంటి చిత్రాలలో నటించింది. నేహాశర్మ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో వృత్తిపరంగా నిరాశ‌ప‌డిన ఓ అనుభవాన్ని వివ‌రించింది. తాను ఒక ప్రాజెక్ట్‌లో నటించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని, అయితే చిత్రనిర్మాతలు చివరి నిమిషంలో త‌న‌ స్థానంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను తీసుకున్నారని తెలిపింది.

తాజా ఇంటర్వ్యూలో నేహా శర్మ త‌న‌ను అకస్మాత్తుగా సినిమా నుండి తొలగించ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఇదే విషయాన్ని సుదీర్ఘంగా చర్చిస్తూ, ఆ వ్యక్తికి విపరీతమైన సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉండ‌డ‌మే త‌న‌ను తొల‌గించ‌డానికి కార‌ణ‌మ‌ని శర్మ గాళ్ గుర్తు చేసుకున్నారు. ఆడిష‌న్స్ కి వెళ్లాను. నాలుగైదు సెష‌న్స్ లో పాల్గొన్నాను. మొత్తం బృందంతో కలిసిపోయాను. నేను ఈ సినిమా మొద‌టి భాగానికి సరిపోతాను. ప్రతిదీ సజావుగా సాగుతోంది. ఇంతలోనే అకస్మాత్తుగా నేను ఎంపిక కాలేద‌ని కాల్ వచ్చింది. ఏం జరిగిందని నేను వారిని అడిగినప్పుడు మిలియన్ల (ల‌క్ష‌లాది) మంది ఫాలోవ‌ర్స్ ఉన్న‌ ప్రభావశీలిని ఎంపిక చేసుకున్నార‌ని నేను తెలుసుకున్నాను``అని చెప్పింది.

శ‌ర్మా గాళ్ లేటెస్ట్ వీడియో ఒక‌టి అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. ఇందులో టాప్ యాంగిల్ లో సెల్ఫీ దిగిన నేహా స్వ‌యంగా ఇన్ స్టాలో దీనిని పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీ వీడియోలో నేహా త‌న అందాల‌ను ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఆవిష్క‌రించింది. అయితే తాను ఇలా చేయ‌డానికి కార‌ణ‌మేమిటో ఇంత‌కుముందే ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన దానిని బ‌ట్టి అర్థం చేసుకోవచ్చు. తాను ఒక ప్రాజెక్ట్ నుంచి అర్థాంత‌రంగా తొల‌గించ‌బ‌డ్డాన‌ని ఆవేద‌న చెందింది. ఒక చిత్రంలో నటించడం అనేది సోషల్ మీడియా పాపులారిటీపై కాకుండా ప్రతిభ - నటనా సామర్థ్యంపై ఆధారపడి ఉండాల‌ని శర్మ తన అభిప్రాయాన్ని తెలియ‌జేసింది. నా దృష్టిలో శిక్షణ పొందిన నటీన‌టుల ప్రాధాన్య‌త‌.. క్యాస్టింగ్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరి ఆన్‌లైన్ అభిమానుల సంఖ్య కంటే ఎక్కువ వెయిట్ ని కలిగి ఉండాలి. సామాజిక మాధ్య‌మాల్లో ప్రభావితం చేసే వ్యక్తులు ప్రజలను థియేటర్‌లకు ర‌ప్పించ‌గ‌ల‌ర‌ని కొంతమంది ద‌ర్శ‌క‌ నిర్మాతలు ప్రస్తుతం భావిస్తున్నారని కానీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నటనా ప్రతిభను దృష్టిలో ఉంచుకుని సిస‌లైన వారిని ఎంపిక చేయాల‌ని కోరారు.

బాలీవుడ్‌లో కాస్టింగ్ విధానాల గురించి ప్ర‌స్థావిస్తూ.. నటీనటులు తక్కువ సంఖ్యలో మాత్రమే ఆడిషన్స్‌కి ఎంపిక‌వుతారని శర్మ పేర్కొన్నారు. ద‌ర్శ‌క‌నిర్మాతలు ఒక ప్రాజెక్ట్ కోసం వారి ప్రమాణాలు అవసరాల ఆధారంగా నటీనటులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత, ఎంపికలు చాలా పరిమితమ‌వుతాయని ఆమె వివరించారు. గతంలో థియేట్రికల్ విడుదలలు అధికంగా ఉన్న తారలపై విపరీతమైన ఒత్తిడి ఎలా ఉండేదో కూడా నేహా గుర్తుచేసుకుంది. అయితే కాలం మారిందని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నందున ప్రతి ఒక్కరికీ మరిన్ని అవకాశాలు ల‌భిస్తాయ‌ని ఆశావాదాన్ని వ్య‌క్తం చేసింది.