Begin typing your search above and press return to search.

ఆ హీరో ఫ్యామిలీ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయ్యాడా?

కొందరు నచ్చజెప్పి క్లియర్ చేయాలని చూసినా.. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం వల్ల అంత వేగంగా క్లోజ్ అవ్వవు.

By:  Tupaki Desk   |   20 May 2024 12:22 PM GMT
ఆ హీరో ఫ్యామిలీ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయ్యాడా?
X

ఏ కుటుంబంలో అయినా వివాదాలు సహజమే. కొన్ని వెంటనే సద్దుమణుగుతాయి. మరి కొన్ని ఏళ్లపాటు కొనసాగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు ఒకరు చేసిన పని వల్ల ఉన్న వివాదాలు కాస్త ముదురుతుంటాయి. ఇలాంటి ఘటనల గురించి మనం చాలా వినే ఉంటాం. కొందరు నచ్చజెప్పి క్లియర్ చేయాలని చూసినా.. ఎవరో ఒకరు ఏదో ఒకటి అనడం వల్ల అంత వేగంగా క్లోజ్ అవ్వవు.

ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ కుటుంబంలో ఇదే జరిగింది. ఆ ఫ్యామిలీలో ఎప్పటి నుంచో వివాదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు పార్టీలు, వేడుకల్లో కలిసినా కోల్డ్ వార్ జరుగుతూనే ఉందని టాక్ వినిపిస్తుంటుంది. బయట కలిసినప్పుడు మాట్లాడుకుని సరదాగా గడిపినా.. తెర వెనుక సీన్ మాత్రం వేరేలా ఉంటుందని అందరూ చెబుతుంటారు. ఇప్పుడు అదే కుటుంబంలో ఇటీవల పొలిటికల్ విభేదాలు కూడా వచ్చాయి.

దీంతో ఇంకేముంది.. పెద్ద వివాదమే నడిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దాని కోసమే చర్చ. నెట్టింట కొన్ని రోజులుగా అందుకు సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఆ వివాదం క్లియర్ అయినట్లు కనిపించినా.. ఒక్క పోస్ట్ వల్ల కథ మొదటికి వచ్చింది. దీంతో ఇప్పుడు ఆ ఫ్యామిలీకి చెందిన ఓ మెంబర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ ఫ్యామిలీకి చెందిన ఓ స్టార్ హీరో రీసెంట్ గా సడెన్ డెసిషన్ తీసుకున్నారట. తన కుటుంబానికి చెందిన అన్ని వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఆయన లెఫ్ట్ అయ్యారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవల జరిగిన వివాదం వల్లే ఆ తెలుగు టాప్ హీరో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ స్టార్ హీరో సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఆ వివాదం క్లియర్ అవ్వాలని కోరుకున్నారు. ఒకానొక సమయంలో మొత్తం సద్దుమణిగిపోయిందని అందరూ అనుకున్నారు. ఇంతలో ఓ పని మళ్లీ అగ్గి రాజేసింది. దీంతో ఇప్పటికైనా క్లియర్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ఆ స్టార్ హీరోకి కొందరు నచ్చజెప్పడానికి ట్రై చేసినా.. ఆయన గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.