Begin typing your search above and press return to search.

మెగా - అల్లు బాండింగ్.. లెక్క మారాలంటే ఇలా చేయలేమో?

అయితే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై యునానమస్ గా ప్రశంసలు లభిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   5 Dec 2024 12:25 PM GMT
మెగా - అల్లు బాండింగ్.. లెక్క మారాలంటే ఇలా చేయలేమో?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవాటైడ్ మూవీ 'పుష్ప 2' ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే రెగ్యులర్ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో బజ్ గట్టిగానే ఉంది. అయితే అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై యునానమస్ గా ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాలో బన్నీ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే 'పుష్ప 2' సినిమాకి ముందు నుంచి సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్ నడుస్తోంది. ఓ వర్గం మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు. మరో వైపు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేసే వారికి ధీటుగా వారి హీరోలపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ క్రియేట్ చేసింది. దీనికి తోడు ఆధారంగా అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడనే మరోవర్గం వారు తప్పుగా అనుకుంటున్నారు.

ఇక 'పుష్ప 2' మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. మెగా ఫ్యాన్స్ లో మెజారిటీ గా ఓ వర్గం ఈ సినిమాని అన్ అఫీషియల్ గా బాయ్ కట్ చేశారు. ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్ పైన కూడా ఉందనే మాట వినిపిస్తోంది. ఏపీలో 'పుష్ప 2' మూవీ టికెట్ ధరలు పెంచడం, అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి థాంక్స్ చెప్పడంతో ఈ వివాదం కొంత సద్దుమణిగినట్లు అనిపించింది. అయితే అల్లు ఫ్యాన్స్ ముసుగులో ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలు జనసైనికులని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన సినిమాలోని డైలాగ్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ఇవి మెగా హీరోలని ఉద్దేశించి బన్నీ చెప్పాడనే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప 2కి పాజిటివ్ టాక్ పెరగాలంటే కచ్చితంగా మెగా హీరోలతో మరల సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్, నాగబాబు ఇప్పటికే 'పుష్ప 2' సినిమాపై పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ విషెష్ చెప్పారు.

బన్నీ కూడా ఈ మూవీ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేసి మెగా హీరోలని ఇన్వైట్ చేసి ఒకేతాటిపైకి రావాలని అంటున్నారు. మెగా, అల్లు ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న వారు కూడా ఇదే కోరుకుంటున్నారు. అయితే దీనికి అల్లు అర్జున్ ముందడుగు వేయాల్సిన అవసరం వేస్తే బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇది సాధ్యం అవుతుందా అనేది చూడాలి.