ఓపిక పట్టి ఉంటే తారక రాముడు దొరికేవాడే..!
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సినిమా విషయంలో చాలా సంతృప్తి కరంగా కనిపిస్తున్నారు.
By: Tupaki Desk | 25 Jan 2025 4:00 PM GMTటాలీవుడ్ లో వరుసగా 8 సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను తన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఆ సినిమా విషయంలో చాలా సంతృప్తి కరంగా కనిపిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్నాడు.
రీసెంట్ గా తన తొలి సినిమా పటాస్ రిలీజై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా అనిల్ రావిపూడి తొలి సినిమానే మంచి సక్సెస్ అందుకుంది. ఆ సినిమాతోనే తన కామెడీ టచ్ ని ఆడియన్స్ కి చూపించాడు అనిల్ రావిపూడి. ఐతే ఈ క్రమంలోనే పటాస్ తర్వాత ఎన్ టీ ఆర్ తో సినిమా చేయాల్సింది కానీ మిస్ అయ్యిందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.
పటాస్ సక్సెస్ కాగానే ఎన్ టీ ఆర్ కు ఒక కథ వినిపించానని.. ఐతే ఆయన కొంత టైం తీసుకున్నారని ఈలోగా దిల్ రాజు రవితేజ కాంబోలో రాజా ది గ్రేట్ సినిమా ఆఫర్ వచ్చింది. ఐతే త్వరగా సినిమా చేయాలని అది ఒప్పేసుకున్నా అన్నారు అనిల్ రావిపూడి. ఐతే కొనాళ్లు వెయిట్ చేసి కథ ను ఇంకాస్త బెటర్ గా చేసి ఉంటే ఎన్ టీ ఆర్ తో సినిమా ఆఫర్ వచ్చేదని అన్నారు అనిల్ రావిపూడి.
కొన్నిసార్లు అంతే క్రేజీ కాంబినేషన్స్ ఇలా చేతి దాకా వచ్చినట్టే వచ్చి మిస్ అవుతుంటాయి. ఐతే ఎన్ టీ ఆర్ తో అప్పుడు మిస్ అయినా కూడా అనిల్ ఫిల్మోగ్రఫీ లో సూపర్ స్టార్ మహేష్, వెంకటేష్, బాలకృష్ణ ఇలా అందరు స్టార్స్ వచ్చి చేరారు. అనిల్ ఎన్ టీ ఆర్ కు చెప్పిన ఆ కథ ఇప్పటికీ పనికొస్తుంది అనుకుంటే దాన్నే ఇప్పటి టైం కి సెట్ చేసి పెడితే తప్పకుండా ఎన్ టీ ఆర్ తో అనిల్ సినిమా ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి తారక్ తో అనిల్ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.