Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో.. 2026 సంక్రాంతికి ఛాన్స్ ఉంటుందా..?

స్టార్ సినిమాలు కొన్ని ఫలానా టైం కి రిలీజ్ అవ్వాలని ముందు నుంచి ఒక ప్లానింగ్ తో వస్తుంటారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 3:00 AM GMT
క్రేజీ కాంబో.. 2026 సంక్రాంతికి ఛాన్స్ ఉంటుందా..?
X

స్టార్ సినిమాలు కొన్ని ఫలానా టైం కి రిలీజ్ అవ్వాలని ముందు నుంచి ఒక ప్లానింగ్ తో వస్తుంటారు. ముఖ్యంగా ఫెస్టివల్ టైల్ లో అయితే స్టార్ సినిమాల సందడితో థియేటర్ లు కళకళలాడతాయి. న్యూ ఇయర్ తో మొదలు పెడితే సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్ మస్ ఇలా పెద్ద పండగలనంటినీ టార్గెట్ చేసుకుని స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ టార్గెట్ పెట్టుకుంటాయి. ఐతే వాటిలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ సినిమాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతికి కొన్ని కాంబో సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి.

డైరెక్టర్ హీరో కాంబో అది కూడా సంక్రాంతికి వచ్చిన సినిమా హిట్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అలాంటిది ఆ డైరెక్టర్ ప్రతి సినిమా సంక్రాంతికి తెస్తూ హిట్లు కొడితే ఆ రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అలా సంక్రాంతి డైరెక్టర్ గా ఈమధ్య కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన చేసిన 8 సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు సంక్రాంతికి వచ్చాయి.

ఫెస్టివల్ కి వచ్చి సూపర్ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి. ఈసారి సంక్రాంతికి కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి చేసిన హ్యాట్రిక్ సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. ఐతే నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తాడని టాక్. సినిమా దాదాపు లాక్ అయినా త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తుంది.

ఐతే ఈ సినిమాను కూడా 2026 సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాను అసలైతే ఈ సంక్రాంతికి తీసుకు రావాల్సి ఉన్నా కుదరలేదు. సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐతే అనిల్ తో సినిమా 2026 సంక్రాంతికి వస్తే అనిల్ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిరుతో తన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మెగాస్టార్ యూనిక్ స్టైల్ ని ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తున్నాడు అనిల్. ఐతే చిరు సినిమాని అంత త్వరగా పూర్తి చేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా తో పాటు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో చిరంజీవి సినిమా కూడా చేస్తాడని తెలుస్తుంది.