Begin typing your search above and press return to search.

బెల్లంకొండ ఈసారి గురి తప్పదా..?

అన్ని సినిమాలు క్రేజీ కాంబినేషన్స్ తో సెట్ చేసుకున్నాడని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   21 Oct 2024 12:30 PM GMT
బెల్లంకొండ ఈసారి గురి తప్పదా..?
X

యాక్షన్ హీరో అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా లక్ కలిసి రాక అలా వెనకబడిపోయాడు బెల్లంకొండ హీరో సాయి శ్రీనివాస్. సక్సెస్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్తున్న బెల్లంకొండ స్పీడుకు ఈమధ్య బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం అతను మళ్లీ తన దూకుడు కొనసాగిస్తున్నాడు. ఒకేసారి సెట్స్ మీద మూడు సినిమాలు ఉంచాడు. అన్ని సినిమాలు క్రేజీ కాంబినేషన్స్ తో సెట్ చేసుకున్నాడని తెలుస్తుంది.

బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా బైరెడ్డి లుధీర్ డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్. దీనితో పాటు కౌశిల్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ హీరో.

ఇవన్నీ లైన్ లో ఉండగా విజయ్ కనకమేడల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ లు కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. తమిళ సినిమా గరుడన్ కు రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. ఐతే తెలుగులో కూడా ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత వీర ధీర శూర అనే టైటిల్ అనుకున్నారు. ఆ టైటిల్ పై ఎందుకో చిత్ర యూనిట్ అసంతృప్తిగా ఉన్నారని తెలియగా ఇప్పుడు ఆ సినిమాకు వామన టైటిల్ లాక్ చేశారట.

టైటిల్ ని రిజిస్ట్రేషన్ కూడా చేయించారని తెలుస్తుంది. త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా వస్తుందని చెబుతున్నారు. సాలిడ్ కటౌట్ ఉన్నా కూడా సరైన కథలు పడక సగటు హీరోగానే ఉండిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరి రాబోతున్న ఈ సినిమాలతో బెల్లంకొండ హీరో తన సత్తా చాటుతాడేమో చూడాలి. వామన సినిమా ఐతే భారీ మల్టీస్టారర్ గా రాబోతుంది కాబట్టి ఈ సినిమాతో బెల్లంకొండ తిరిగి ఫాం లోకి వస్తారేమో చూడాలి.