Begin typing your search above and press return to search.

డాకు మహరాజ్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?

పలు విజయవంతమైన సినిమాల తరువాత బాలయ్య నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ పట్ల ప్రేక్షకుల ఆసక్తి ట్రైలర్ అనంతరం మరింత పెరిగింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 12:07 PM GMT
డాకు మహరాజ్.. బాక్సాఫీస్ టార్గెట్ ఎంత?
X

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన డాకు మహరాజ్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ మాస్ సినీ ప్రేమికుల్లో కూడా ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. పలు విజయవంతమైన సినిమాల తరువాత బాలయ్య నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ పట్ల ప్రేక్షకుల ఆసక్తి ట్రైలర్ అనంతరం మరింత పెరిగింది.

వివిధ సెంటర్లలో మంచి బిజినెస్‌తో ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే అతి పెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్‌గా నిలిచింది. మొత్తం మీద డాకు మహరాజ్ 80.70 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సాధించి, NBK స్టార్ పవర్‌ను మరోసారి రుజువు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది.

సంక్రాంతి సీజన్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, బాలయ్య గత చిత్రాల హిట్ ఫామ్ ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్‌ను తీసుకువస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 82 కోట్ల షేర్‌ను అందుకుంటే, బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ షేర్ సాధించిన చిత్రంగా నిలుస్తుంది. ఇది కాకుండా, డాకు మహరాజ్ బాలయ్యకు మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించబోతోందని మేకర్స్ ఆశిస్తున్నారు.

సినిమా విడుదల తరువాత వసూళ్లతో పాటు ఫ్యాన్స్ నుండి వచ్చే స్పందన కూడా సినిమా విజయాన్ని నిర్ధారిస్తుంది. శక్తివంతమైన కథ, బాలయ్య స్టైల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద మరింత బలంగా నిలబెడతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా సీడెడ్, నైజాం వంటి ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

ఇక సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను ఏరియాల వారీగా పరిశీలిస్తే:

నైజాం: ₹17.50 కోట్లు

సీడెడ్: ₹15.50 కోట్లు

ఉత్తరాంధ్ర: ₹8 కోట్లు

తూర్పు గోదావరి: ₹6 కోట్లు

పశ్చిమ గోదావరి: ₹5 కోట్లు

గుంటూరు: ₹7.2 కోట్లు

కృష్ణా: ₹5.4 కోట్లు

నెల్లూరు: ₹2.7 కోట్లు

AP-TG టోటల్: ₹67.30 కోట్లు

కర్ణాటక + ROI: ₹5.40 కోట్లు

ఓవర్సీస్: ₹8 కోట్లు

మొత్తం WW బిజినెస్: ₹80.70 కోట్లు

మొత్తం మీద, ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే 82 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాల పోటీ ఉన్నా, బాలయ్య తన మాస్ క్రేజ్‌తో డాకు మహరాజ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.