Begin typing your search above and press return to search.

'డాకు మహారాజ్‌'లోని ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో..!

త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 1:30 AM GMT
డాకు మహారాజ్‌లోని ఆ సర్‌ప్రైజ్‌ ఏంటో..!
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్‌ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హ్యాట్రిక్‌ తర్వాత బాలకృష్ణ 'డాకు మహారాజ్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్‌ దక్కించుకున్న బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్‌ భార్య సాయి సౌజన్య ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.

ఈ సినిమాను 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సంక్రాంతికి రాబోతున్న గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల పోటీ తట్టుకోవడం కోసం డాకు మహారాజ్‌ను చాలా స్ట్రాంగ్‌గా దర్శకుడు బాబీ రూపొందించారు అనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు యంగ్‌ స్టార్‌ హీరోల గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు చాలా స్పెషల్‌ అంటూ యూనిట్‌ సభ్యులు లీక్ ఇస్తున్నారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. ఇప్పటికే షూటింగ్‌ను సైతం ముగించుకున్న ఆ ఇద్దరు హీరోలు త్వరలోనే డబ్బింగ్‌ సైతం చేయబోతున్నారట.

బాలకృష్ణ డాకు మహారాజ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంను నిర్మాత నాగ వంశీ వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో డాకు మహారాజ్ సినిమా యొక్క రచ్చ మామూలుగా లేదు. బాలకృష్ణ గత చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా సైతం భారీ వసూళ్లు నమోదు చేస్తుందని నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. విభిన్నమైన కథ, కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోన్న నేపథ్యంలో బాలయ్య కెరీర్‌లో నిలిచి పోయే సినిమా అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

ఈ సినిమాలో హీరోయిన్స్‌గా శ్రద్దా శ్రీనాథ్‌ తో పాటు ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తూ ఉన్నారు. బాలకృష్ణ రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. డాకు మహారాజ్ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని మొదట భావించినా సంక్రాంతికి వస్తేనే ఈ సినిమాకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అనే అభిప్రాయంతో నిర్మాత నాగ వంశీ ఈ సినిమాను పోటీ తీవ్రంగా ఉన్న సంక్రాంతికి విడుదల చేయబోతున్నారట. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి పాటలు రాలేదు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాన ఉంచి మొదటి పాట త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.