Begin typing your search above and press return to search.

ఇలా ఉంటే టిక్కెట్లు తెగుతాయా డాకు?

సంక్రాంతి మీద నమ్మకమే లేదంటే బాలయ్య హిట్ ట్రాక్ మీద కాన్ఫిడెనన్సో ఏమో గాని డిజిటల్ గ్రౌండ్ లో సౌండ్ అనుకున్నంత సౌండ్ లేకపోవడం ఓ వర్గం ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోంది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 4:51 AM GMT
ఇలా ఉంటే టిక్కెట్లు తెగుతాయా డాకు?
X

సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో ఎప్పుడూ ప్రత్యేకమైనదే. ఈసారి 'డాకు మహారాజ్', 'గేమ్ చేంజర్' వంటి భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, 'డాకు మహారాజ్' సినిమా బిజినెస్ పరంగా భారీ అంచనాలు ఉన్నా, డిజిటల్ ప్రమోషన్స్ విషయంలో టీం అంతగా ఆకట్టుకోలేకపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి మీద నమ్మకమే లేదంటే బాలయ్య హిట్ ట్రాక్ మీద కాన్ఫిడెనన్సో ఏమో గాని డిజిటల్ గ్రౌండ్ లో సౌండ్ అనుకున్నంత సౌండ్ లేకపోవడం ఓ వర్గం ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తోంది.

బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ప్రోమోషన్ అనుకున్న స్థాయిలో జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'డాకు మహారాజ్' ట్రైలర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, టీం ప్రోమోషన్లకు సరైన దిశా నిర్దేశం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. యూఎస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భారీ ఖర్చు పెట్టినప్పటికీ, ఆ ఈవెంట్ ఆశించినంతగా బజ్ క్రియేట్ చేయలేదు.

బాలయ్యకు ఉన్న ఎన్ఆర్ఐ ఫ్యాన్ బేస్‌ను సరిగా ట్యాప్ చేయకపోవడం ఒక పెద్ద మైనస్‌గా మారింది. ఇదే సమయంలో 'గేమ్ చేంజర్' ప్రమోషన్లు యూఎస్‌లో విజయవంతంగా జరిగి మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇక ప్రొడ్యూసర్ నాగ వంశీ మీడియా ముందుకు రావడం, తన బోల్డ్ కామెంట్లతో చర్చనీయాంశమవడం జరిగినా, సోషల్ మీడియాలో సినిమా గురించి పెద్దగా చర్చ జరగడం లేదు.

బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో భాగస్వామ్యం అవడం వంటి ప్రయత్నాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చేసిన వ్యూహాల్లో కొన్ని. కానీ, ఇవన్నీ సరిపోలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ వంటి బ్యానర్‌కి ఉన్న పేరును బట్టి చూస్తే, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లపై మరింత బలంగా తమ చిత్రాన్ని ప్రమోట్ చేయాలి. కానీ అలాంటి వైబ్ కనిపించడం లేదు.

బాలకృష్ణ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం, సంక్రాంతి సీజన్ ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే శక్తి ఉన్న సమయాల్లో టీం మరింత చొరవ చూపాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలే బాలయ్య కోసం ఎప్పుడు లేనంత బడ్జెట్ పెట్టారు. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే వీకెండ్ లోపే టిక్కెట్లు గట్టిగా తెగాలి. ఇక 'డాకు మహారాజ్' హిట్‌గా నిలవాలంటే, ఇప్పటికైనా టీం తమ డిజిటల్ వ్యూహాలను మార్చి, పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడం చాలా అవసరం.