Begin typing your search above and press return to search.

2024 టాప్ గ్రాస్.. దేవర vs దెయ్యమే?

ఇప్పటికే ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 6:23 AM GMT
2024 టాప్ గ్రాస్.. దేవర vs దెయ్యమే?
X

నందమూరి అభిమానుల ఆరేళ్ళ ఆకలి మరో రెండు రోజుల్లో ‘దేవర’ ద్వారా తీరనుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ‘దేవర’ మూవీ దేశ వ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ కి పబ్లిక్ లో మిశ్రమ స్పందనలు వచ్చిన కూడా ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నారు.

ఇప్పటికే ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ హౌస్ ఫుల్ అయిపోయాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలాగే ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.5+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ‘దేవర’ అప్పుడే వసూళ్లు చేసింది. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే దేవర మూవీకి హైయెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

అయితే మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు ఇంటరెస్టింగ్ మ్యాటర్ గా మారింది. ‘దేవర’ మూవీ మొదటి రోజు 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎన్టీఆర్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే అంత సాధ్యం కాకపోవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో అత్యధిక ఆదరణ ఉంటుందని, మిగిలిన చోట్ల హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చని అంటున్నారు.

అయితే ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో ‘స్త్రీ 2’ మూవీ వసూళ్లని ‘దేవర’ క్రాస్ చేయొచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన చిత్రాలలో 183.20 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ తో ‘కల్కి 2898ఏడీ’ టాప్ లో ఉంది. దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీ 104.75 కోట్ల గ్రాస్ తో రెండో స్థానంలో నిలిచింది. హిందీ మూవీ ‘స్త్రీ 2’ మొదటి రోజు 83.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. దీనిని ‘దేవర’ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ తో బీట్ చేస్తుందని అంటున్నారు.

‘స్త్రీ 2’ తర్వాత ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నాలుగో స్థానంలో ‘గుంటూరు కారం’ ఉంది. ఈ సినిమా 79.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఐదో స్థానంలో ఉన్న ‘ఫైటర్’ మూవీ 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మొదటి రోజు అందుకుంది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’ మూవీ 32 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ తో టాప్ 6లో ఉంది. వీటిలో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రాలుగా ‘కల్కి’, ‘స్త్రీ 2’ సినిమాలు నిలిచాయి. అయితే ‘దేవర’ మూవీ ఈ ఏడాది హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా ఈ టాప్ 6లో ఏ నెంబర్ లోకి వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2024లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ అందుకున్న సినిమాలు

కల్కి 2898ఏడీ - 183.20 కోట్లు

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - 104.75 కోట్లు+

స్ట్రీ 2 - 83.45 కోట్లు

గుంటూరు కారం - 79.30 కోట్లు

ఇండియన్ 2 - 58.10 కోట్లు

ఫైటర్ - 35.65 కోట్లు+

బడే మియాన్ చోటే మియాన్ - 32 కోట్లు