Begin typing your search above and press return to search.

'దేవ‌ర‌'కు అక్క‌డ ప్ర‌ముఖ‌ హీరో అండ‌దండ‌లు

తాజా స‌మాచారం మేర‌కు.. దేవ‌ర‌ కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దుల్కర్ సల్మాన్ కి చెందిన‌ వేఫేరర్ ఫిలింస్ ఛేజిక్కించుకుంద‌ని తెలిసింది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:39 PM GMT
దేవ‌ర‌కు అక్క‌డ ప్ర‌ముఖ‌ హీరో అండ‌దండ‌లు
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన పాన్ ఇండియా చిత్రం 'దేవర' సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఉత్త‌రాది, ద‌క్షిణాది రెండు చోట్లా అత్యంత భారీగా విడుద‌ల కానున్న ఈ సినిమా ఓవ‌ర్సీస్ లోను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా విడుద‌ల‌వుతోంది. అయితే తెలుగు సినిమాల వ‌సూళ్లు ఇరుగు పొరుగు భాష‌ల్లో డ‌బుల్ డిజిట్ తేవ‌డం చాలా క‌ష్టంగా ఉంటోంది. అన్ని సినిమాలు ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ త‌ర‌హా మ్యాజిక్ ని చేయ‌లేవు. కానీ ఇప్పుడు దేవ‌ర మాత్రం అసాధార‌ణ క్రేజ్ తో ఆశ‌ల్ని పెంచుతోంది.


తాజా స‌మాచారం మేర‌కు.. దేవ‌ర‌ కేరళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దుల్కర్ సల్మాన్ కి చెందిన‌ వేఫేరర్ ఫిలింస్ ఛేజిక్కించుకుంద‌ని తెలిసింది. పేరున్న సంస్థ గ‌నుక‌ కేరళలోను భారీ ఓపెనింగ్ వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మాలీవుడ్ లో క్రేజ్ ఉన్న హీరో ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా అక్క‌డా భారీ ఓపెనింగులు తెస్తుంద‌నే అంచ‌నాలేర్ప‌డుతున్నాయి.

దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ స‌హా భారీతారాగ‌ణం ఇందులో న‌టించారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించ‌గా, వాటికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా పాట‌ల్లో ఎన్టీఆర్ తో జాన్వీ రొమాన్స్ ఒక రేంజులో వ‌ర్క‌వుటైంద‌న్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ట్రైల‌ర్ కి మాస్ లో మంచి స్పంద‌న వ‌చ్చింది. పాట‌ల‌కు అన్ని వ‌ర్గాల్లో గుర్తింపు ద‌క్కింది. గ‌నుక ఇవ‌న్నీ దేవ‌ర‌కు ప్ల‌స్ కానున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రో 8 రోజుల్లో దేవ‌ర‌లో మ్యాట‌ర్ ఎంత‌? అన్న‌ది తేలిపోనుంది.