దిల్ రూబా టెస్ట్ పాస్ అవుతాడా..?
సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా క తర్వాత రాబోతున్న ఈ దిల్ రూబా తో కూడా కిరణ్ అబ్బవరం మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది.
By: Tupaki Desk | 9 March 2025 9:00 AM ISTక సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం తన నెక్స్ట్ సినిమా దిల్ రూబాతో వస్తున్నాడు. మార్చి 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా క తర్వాత రాబోతున్న ఈ దిల్ రూబా తో కూడా కిరణ్ అబ్బవరం మరో సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది.
తెలుగు యువ హీరోల్లో సిన్సియర్ ఎఫర్ట్ తో సినిమాలు చేస్తూ తన బెస్ట్ అందిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఐతే క సినిమా ముందు వరకు కూడా అతను చేసిన ప్రయత్నాలన్నీ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే క తో తన సత్తా చాటాడు కిరణ్ అబ్బవరం. క తర్వాత దిల్ రూబా సినిమా రావడంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఏర్పడింది.
ఐతే ఒక సూపర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దిల్ రూబా మీద కొంత ఆసక్తి ఉంటుంది. కిరణ్ అబ్బవరం నిజంగానే ఆ టెస్ట్ పాస్ అవుతాడా లేదా అన్నది మరో వారం రోజుల్లో తెలుస్తుంది. ఐతే కచ్చితంగా కిరణ్ ఈ టెస్ట్ లో పాస్ అయ్యే ఛాన్స్ లే ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడమే కాదు సోషల్ మీడియాలో మంచి డిస్కషన్స్ కూడా జరిగేలా చేస్తుంది.
ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి హీరోగా సక్సెస్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఒక్కో సినిమాకు తన టాలెంట్ చూపుతూ వచ్చిన కిరణ్ అబ్బవరం క తర్వాత కెరీర్ లో ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత చేసిన సినిమా కాబట్టి దిల్ రూబా కూడా అదే తరహా ఫలితాన్ని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి దిల్ రూబా ఆడియన్స్ అంచనాలను అందుకుంటుందా లేదా సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్స్ అంతా టికెట్ల రూపంలో వస్తాయా లేదా అన్నది చూడాలి.
మార్చి 14 హోళీ సందర్భంగా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో దిల్ రూబా వస్తుంది. సామ్ సిఎస్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా అవబోతుంది.